సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 27 సెప్టెంబరు 2021 (13:46 IST)

భార్యాభర్తల మధ్య గొడవ: భార్య ముక్కు కొరికేసిన భర్త

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో భార్యపై భర్త దాడి చేసి ముక్కు కొరికేశాడు. రత్లం జిల్లాలో ఈ ఘటన జరిగింది. తన భర్తతో మహిళ గృహ వివాదం జరుగుతోంది. ఆగ్రహంతో ఊగిపోయిన భర్త అతడి భార్య ముక్కును కొరికేశాడు. బాధితురాలు టీనా భర్త దినేష్ మాలిని పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేసారు.
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దినేష్- టీనాలు 2008లో ఉజ్జయినిలో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఐతే పెళ్లయిన దగ్గర్నుంచి కుదురుగా ఉద్యోగం చేయకపోవడమే కాకుండా మద్యం సేవించడం పనిగా పెట్టుకున్నాడు. ఇంటికి వచ్చి భార్యపై నిత్యం గొడవకు దిగేవాడు. వివాహం అయిన దగ్గర్నుంచి టీనా గృహ హింసకు గురైంది. వేధింపులతో విసిగిపోయిన ఆమె తన కుమార్తెలతో పాటు తల్లిగారి ఇంటికి వెళ్లి వంట మనిషిగా జీవనం సాగించింది. 2019లో, ఆమె తన భర్త నుండి మెయింటెనెన్స్ కోరుతూ కోర్టు కేసు వేసింది.
 
దినేశ్ ఇటీవల భార్య తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి భార్యాబిడ్డల నిర్వహణ విషయంపై చర్చించగా, భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోపంతో, దినేష్ తన కుమార్తెల ముందు టీనాపై దాడి చేసి పళ్లతో ఆమె ముక్కును పట్టుకుని కొరికేశాడు. టీనాకి తీవ్ర రక్తస్రావం గమనించి, దినేష్ అక్కడి నుంచి పారిపోయాడు.
 
 టీనా, ఆమె కుమార్తెల ఏడుపులు విన్న ఇరుగుపొరుగు వారు ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.