మగపిల్లలు ఎందుకు పుట్టలేదంటూ చిత్రహింసలు.. ప్రాణాలు తీసుకుంటున్నా...
మగ పిల్లలు ఎందుకు పట్టలేదంటూ చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా తన కళ్లముందే భార్య ఆత్మహత్య చేసుకుంటున్నా ఏమాత్రం కనికరం లేకుండా చూస్తూ నిల్చొండిపోయాడు. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తల్లిని ఆస్పత్రికి తరలించేందుకు కన్నబిడ్డలు ప్రయత్నిస్తుంటే వారిపై కిరాతకడు దాడి చేసి అడ్డుకున్నాడు. దీంతో ఆ మహిళ కన్నబిడ్డలు, భర్త ముందే ప్రాణాలు విడిచింది.
పలువురుని కంటతడిపెట్టించిన ఈ దారుణ సంఘటన శుక్రవారం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఎం పహాడీలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు ఎంఎం పహాడీలో నివాసం ఉండే మహ్మద్ సాజీద్, షభానాబేగం అనే దంపతులు ఉన్నారు. వీరికి ఐదు మంది ఆడ పిల్లలు సంతానం.
అయితే, సాజీద్ స్థానికంగా ఉండే ఓ టెంట్ హౌస్‌లో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అలా వారి జీవిత సాఫిగానే కొనసాగుతున్న తరుణంలో సాజీద్ మద్యానికి బానిసయ్యాడు. నిత్యం ఫుల్‌గా తాగి ఇంటికి వచ్చేవాడు. మత్తులో భార్యతో గొడవపడుతూ అందరు ఆడపిల్లలనే కన్నావంటూ వేధించేవాడు.
మగపిల్లలు ఎందుకు పుట్టలేదంటూ సూటిపోటి మాటలతో వేధించసాగాడు. మానసికంగానే కాకుండా శారీరకంగా వేధించసాగాడు. కట్టుకున్న వాడే నిత్యం నరకం చూసిస్తూంటే ఇక ఈ జీవితం వద్దనుకుంది. ఈ నేపథ్యంలో పలుమార్లు భర్తతో తాను వేధింపులు తట్టుకోలేనని, ప్రాణాలైన విడిచేస్తానంటూ చెప్పింది. అయినా ఏ మాత్రం అదరని, బెదరని సాజీద్ భార్యను వేధించడం మరింతగా చేయసాగాడు.
దీంతో తీవ్ర మనస్తాపం చెందిన షభానాబేగం ఇంట్లో భర్త ముందే పురుగుల మందు సేవించించి అపస్మారక స్థితికి చేరింది. అయినా కనికరం లేని భర్త కనీసం ఆస్పత్రికి తీసుకువెళ్లి కాపాడే ప్ర యత్నం చేయకపోగా, పిల్లలు తల్లిని ఆ స్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా వారిపై దాడి చేసి గదిలో బందించాడు. దాంతో పురుగుల మందు సేవించిన షబానాబేగం మృతి చెందింది.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని శవ పంచనామ నిర్వహించి షబానా మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతురాలు పిల్లలు, కుంటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాజీద్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసును రాజేంద్రనగర్ పోలీస్ దర్యాప్తు చేస్తున్నారు.