మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (20:55 IST)

మంచు విష్ణుకు క్ర‌మ‌శిక్ష‌ణ లేదా!

Manchu Vishnu
మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడిగా మంచు విష్ణు నిల‌బ‌డ‌తున్న విష‌యం తెలిసిందే. నిన్న‌నే త‌న పేన‌ల్ పోస్ట‌ర్‌ను సోష‌ల్‌మీడియాలో విడుద‌ల చేశాడు. ఈరోజు త‌న పేన‌ల్ స‌భ్యుల‌ను ప‌రిచ‌యం చేసే ఏర్పాటు చేశారు. రెండు గంట‌ల‌కు త‌న పేన‌ల్ స‌భ్యుల‌ను ప‌రిచ‌యం చేయ‌నున్న‌ట్లు నిర్వాహ‌కులు తెలిపారు. కానీ 3.30 వ‌ర‌కు ఆయ‌న రాలేదు.. దాంతో చాలామంది విలేక‌రులు వెనుతిరిగి వెళ్ళిపోయారు. ఇదే మోహ‌న్‌బాబు అయితే స‌మ‌య‌పాల‌న చేసేవాడు. అంద‌రినీ స‌మ‌య‌పాల‌న చేయ‌మ‌ని చెప్ప‌వాడు.
 
మా అసోసియేష‌న్‌కు ఏదో చేస్తాడ‌ని అంద‌రూ అనుకుంటున్న స‌మ‌యంలోనే ఇలా ఆల‌స్యంగా రావ‌డం ప‌ట్ల కొంద‌రు స‌భ్యులు చికాకు వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టి త‌రం క్ర‌మ‌శిక్ష‌ణ లేక‌పోతే ఎలా అంటూ వారిలో వారు గుస‌లాడుకున్నారు. ఈ ఎన్నిక‌ల్లో పోటీగా చేస్తున్న ప్ర‌కాష్‌రాజ్ ఇలా వేయిట్ చేయించ‌లేదు. అంద‌రికంటే ముందుగానే వ‌చ్చి ఏర్పాట్ల‌ను స‌మీక్షించారు. ఇక ఆ త‌ర్వాత 4గంట‌ల‌కు సీనియ‌ర్ న‌టుడు బాబూమోహ‌న్ మాట్లాడుతూ, మా అధ్య‌క్షుడిగా మంచు విష్ణు స‌రైన వాడ‌ని పేర్కొన్నారు. బాబూ మోహన్‌. విష్ణు ప్యానెల్‌ నుంచి ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.