మా- ఎన్నికల్లో బాబూమోహన్ పోటీ
Babumohan
గురువారంనాడు సీనియర్ నటుడు బాబూమోహన్‌కు ఈ ప్రశ్న ఎదురైంది. సంగారెడ్డిలో ఓ కార్యక్రమానికి వెళ్ళిన ఆయన్ను విలేకరులు మా ఎన్నికల వివాదంపై అడుగగా ఆయన ఇలా స్పందించారు. అసలు నోటిఫికేషన్ రాకుండా, ఇప్పటి కమిటీ కాలపరిమితి కాకుండా కొందరు ఎన్నికలు అని కళామ్మతల్లిని అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఇక, నన్ను పోటీ చేయమని కొందరు పెద్దలు అడుగుతున్నారన్న బాబు మోహన్.. దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. అసలు మా క్లిష్ట పరిస్థితుల్లో వుందని కనీసం భవనం లేదని అన్నారు. కేవలం మా భవనం కోసం గొడవ జరుగుతుందని ఇది సరికాదని అన్నారు.
