అసోసియేషన్లు ఎందుకు పెడతారో అర్థం కాదుః మంచు విష్ణు సెస్సేషనల్ కామెంట్
అసోసియేషన్లు ఎందుకు పెడతారు. అంతా కలిసి ఒక్కటిగా వుండేటప్పుడు ఇలా ఒకటికి రెండు అసోసియేషన్లు పెట్టి ఏంచేస్తారు. అని నాకు వారిపై మంచి అభిప్రాయం వుండేది. విదేశాల్లో వున్న తెలుగువారు అంతా ఒక్కటేగదా. మరి సింగపూర్‌లో తెలుగు అసోసియేషన్, మరో అసోసియేషన్. అలాగే ఇత దేశాల్లో ఒకటికి రెండు, మూడు అసోసియేషన్లు వుంటాయి. ఎందుకు ఇలా పెడతారని వారిపై నాకు దురభిప్రాయం వుండేది. కానీ నాకు వ్యక్తిగతంగా వచ్చిన సమస్య వల్ల అలాంటి అసోసియేషన్‌లు ఇందుకోసం పెడతారా అనిపించింది. అంటూ తన అనుభవాన్ని వెల్లడించాడు మంచు విష్ణు.
వివరాల్లోకి వెళితే, అలీతో సరదాగా కార్యక్రమంలో మంచు విష్ణు గెస్ట్‌గా వస్తే ఆయన పలు విషయాలు అడిగారు మంచు విష్ణు భార్య విన్నీ కుటుంబీకులకు కేన్సర్ ఆపరేషన్ నిమిత్తం సింగపూర్ వెళ్ళారు. అందరూ తిరిగి వచ్చారు. రెండురోజులు ఆగాక వస్తానని విన్నీ అంది. అలా విన్సీ పిల్లలతో అక్కడే వుంది. సరిగ్గా ఆ టైంలో కరోనా లాక్‌డౌన్ వచ్చింది. ఎప్పుడు లాక్‌డౌన్ ఎత్తివేస్తారో తెలీదు. పిల్లలతో ఒక్కతే అక్కడ వుంది. కానీ అక్కడ తెలుగు అసోసియేషన్లు, నాన్న అభిమానులు, స్నేహితులు, తోటి నటులు నా కుటుంబానికి చాలా సాయపడ్డారు. ఫైనల్‌గా కొద్దిరోజులకు తిరిగి ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత ఆలోచిస్తే, అసోసియేషన్‌పై వున్న దురభిప్రాయం తొలగిపోయింది. అందుకే నేను కూడా ఏదో ఒకటి చేయాలని మా అసోసియేషన్ అధ్యక్షుడిగా పోటీలో దిగాను అని తెలిపారు.
`మా` అసోసియేషన్ పోటీ అవసరమా?
ఈ ప్రశ్నకు మంచు విష్ణు తెలివిగానే సమాధానం ఇచ్చారు. మనకు ఎంతోమంది దేవుళ్ళు వున్నారు. ఎవరికి నచ్చిన దేవుడ్ని వారు పూజిస్తారు. అలాగే అసోసియేషన్‌లో పోటీ వుంటుంది. ఎవరుకు నచ్చిన వ్యక్తిని వారు ఎన్నుకొనే హక్కు మన దేశంలోనే వుంది కదా. అంటూ సమాధానమిచ్చారు. ఒకవేళ అధ్యక్షుడు అయితే నేను నమ్మిన మంచి పనులు చేస్తానని అదే ధైర్యంతో పోటీ చేస్తున్నానంటూ క్లారిటీ ఇచ్చారు.