మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 23 ఆగస్టు 2021 (19:47 IST)

కాలేజీ స్నేహితురాలినే వివాహం చేసుకుంటున్న కార్తికేయ‌

Kartikeya-Lohita reddy
హీరో కార్తికేయ గుమ్మకొండ నిశ్చితార్థం ఆగస్టు 22 ఆదివారం రాత్రి జ‌రిగింది. పెద్ద‌ల కుదుర్చిన సంబంధ‌మే అని కార్తికేయ ట్వీట్ చేశాడు. అయితే అత‌నికి కాబేయే భార్య లోహిత‌రెడ్డి. ఎన్‌ఐటి వరంగల్‌లో కాలేజీ స్నేహితురాలే. ఇలా స్నేహితురాలినే పెల్లిచేసుకోవ‌డం పెద్ద‌ల అనుమ‌తితో ఒక‌టికావ‌డం చాలా సంతోషంగా వుంద‌ని కార్తికేయ తెలియ‌జేస్తున్నాడు. 
 
ఇప్ప‌టికే కార్తికేయ చేసుకోబోయే అమ్మాయి ఎవ‌రా అని సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌కు తావిచ్చింది. ఇదిలా వుండ‌గా, పెండ్లి ఎప్పుడు ఏమిటి? అనేది మ‌ర‌లా తెలియ‌జేస్తాన‌ని ట్విస్ట్ ఇచ్చాడు. ఇప్ప‌టికే ప‌లు సినిమాల్లో న‌టించిన కార్తికేయ మంచి స‌క్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. నితిన్ కూడా ఇలాగే త‌నకు తెలిసిన అమ్మాయినే పెద్ద‌ల స‌మ‌క్షంలో చేసుకున్నాడు. పెండ్లి త‌ర్వాత ఆయ‌న‌కు మంచి స‌క్సెస్ ద‌క్కింది. ఈ కోవ‌లోనే నాని, రామ్‌చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ కూడా త‌న స్నేహితురాలినే చేసుకున్నారు. మంచి విష్ణుకూడా అదే తీరు. ఇలా యువ హీరోలు ఇలా కాలేజీ స్నేహితురాళ్ళ‌ను పెండ్లిచేసుకోవ‌డం అదీ పెద్ద‌ల ఒప్పందంతో చేసుకోవ‌డం మంచి ప‌రిణామంగా అభిమానులు భావిస్తున్నారు.