శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 జులై 2021 (12:02 IST)

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల తేదీ ఖరారు

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు నిర్వహించే తేదీని ఖరారు చేశారు. సెప్టెంబరు 12వ తేదీన అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. దీనికంటే ముందుగా ఆగస్టు 22న మా సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. 
 
కాగా, ఈ దఫా మా అసోసియేషన్ ఎన్నికల్లో ఈ సారి పోటీకి మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, నటి హేమ, జీవిత రాజశేఖర్ సిద్ధం అయ్యారు. ఒకరి పై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు కూడా చేసుకుంటున్నారు. 
 
అయితే గురువారం మా ఎన్నికలు ఎప్పుడు జరపాలనేదానిపై సమావేశమైన క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజు ఇతర సినీ పెద్దలు సమావేశమై నిర్ణయించారు.