బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 సెప్టెంబరు 2021 (12:25 IST)

#MAAElection : మహామహులను బరిలోకి దించిన మంచు విష్ణు

మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు అక్టోబరు 10వ తేదీన జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ పోటీ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. ఇపుడు హీరో మంచు విష్ణు కూడా బరిలోకి దిగుతున్నారు. ఈయన ప్యానల్ తరపున బరిలోకి దించే సభ్యుల పేర్లను గురువారం వెల్లడించారు. 
 
గెలుపు గుర్రాలను రంగంలోకి దించుతున్నట్టు మంచు విష్ణు తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ ప్యానెల్‌కు ధీటుగా ఉండే అభ్యర్థులనే రంగంలోకి దించినట్టు మంచు విష్ణు వర్గం చెబుతోంది. శుక్రవారం మీడియా ముందుకు మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు రానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు తన అజెండా ప్రకటించనున్నారు. మా కోసం మనమందరం పేరుతో మా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారాయన.
 
కాగా, మంచు విష్ణు ప్యానల్ సభ్యులు వీరే.. 
అధ్యక్షుడు -మంచు విష్ణు
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ -బాబు మోహన్
ఉపాధ్యక్షులు- మాదాల రవి, పృథ్వీరాజ్,
జనరల్ సెక్రటరీ- రఘుబాబు
జాయింట్ సెక్రటరీలు - కరాటే కళ్యాణి, గౌతమ్ రాజ్
ట్రెజరర్ – శివబాలాజీ,
ఈసీ సభ్యులు: అర్చన, అశోక్ కుమార్, గీతాసింగ్, హరినాథ్ బాబు, జయవాణి, మలక్ పేట శైలజ, పూజిత, రాజేశ్వరిరెడ్డి, రేఖ, సంపూర్ణేశ్ బాబు, శశాంక్, శివనారాయణ, శ్రీలక్ష్మి, శ్రీనివాసులు, స్వప్నమాధురి, విష్ణు బోపన్న, వడ్లపట్ల ఎంఆర్సీలు ఉన్నారు.