1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. MAA Election Notification issue

అక్టోబరు 10న మా ఎన్నికలు - నియమ నిబంధనలు ఇవే..

MAA Election
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన నటీనటుల సంఘమైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)కు వచ్చే నెల పదో తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల పోలింగ్ అక్టోబరు 10వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుంది. ఈ పోలింగ్ జూబ్లీ పబ్లిక్‌ స్కూల్‌లో నిర్వహించేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి వి.కృష్ణమోహన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. 
 
ఎన్నికల నిర్వహణ కోసం 8 మంది ఆఫీస్‌ బేరర్స్‌, 18మంది ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్‌తో కూడిన ఈ ఎన్నికలకు ఈ నెల 27 నుంచి 29 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్‌ ఉపసంహరణకు వచ్చే నెల 1–2 తేదీల్లో సాయంత్రం 5 గంటల వరకూ గడువు విధించారు, రెండో తేది సాయంత్రం బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తారు. పోలింగ్‌ రోజు రాత్రి ఏడు గంటలకు ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తారు. 
 
అయితే, ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొన్ని నియమ నిబంధనలు: 
 
1. ఒక అభ్యర్థి ఒక పోస్ట్‌ కోసమే పోటీ చేయాలి.
 
2. గత కమిటీలో ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ అయి ఉండి, 50 శాతం కన్నా తక్కువ ఈసీ మీటింగ్‌లకు హాజరు కాకపోతే పోటీ చేసే అర్హత ఉండదు. 
 
3. 20 శాఖల అసోసియేషన్‌లలో ఆఫీస్‌ బేరర్స్‌గా ఉన్న వారు ఆ పదవులకు రాజీనామా చేయకపోతే ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కారు.   
 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
దేవీశ్రీ ప్రసాద్ ఇంట వరుస విషాద ఘటనలు, ఒకేసారి ఇద్దరు మృతి