గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 సెప్టెంబరు 2021 (12:03 IST)

టాలీవుడ్ డ్రగ్స్ కేసు : నేడు ఈడీ ముందుకు ముమైత్ ఖాన్

తెలుగు చిత్రపరిశ్రమలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో తెలుగు నటి ముమైత్ ఖాన్ ఈడీ అధికారుల ముందు హాజరుకానుంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు సినిమాతారలను ఈడీ అధికారులు విచారించారు. రోజుకి ఒక‌రిని కార్యాల‌యానికి పిలిచి అధికారులు ప్ర‌శ్నిస్తున్నారు. డ్ర‌గ్స్‌కు సంబంధించిన లావాదేవీలు ఏ విధంగా జ‌రిగాయ‌న్న విష‌యంపై అధికారులు విచారిస్తున్నారు. ప్రధానంగా మనీ లాండరింగ్ అంశంపైనే విచారణ జరుగుతుంది. ఇప్పటివరకు పూరిజగన్నాథ్, ఛార్మి, రకుల్ , రానా, నవదీప్, నందు, రవితేజల విచారణ పూర్తయింది. డ్రగ్స్ సప్లేయిర్ కెల్విన్‌తో ఉన్న సంబంధాలపై ఈడీ అధికారులు విచారిస్తున్నారు. 
 
ఇక నేడు నటి ముమైత్ ఖాన్ వంతు వచ్చింది. నేడు ఈడీ అధికారాల ముందుకు ముమైత్ ఖాన్ హాజరుకానుంది. కెల్విన్‌తో ఉన్న సంబంధాలతోపాటు.. ఆమె బ్యాంకు ఖాతాల‌ను అధికారులు పరిశీలించనున్నారు. అలాగే మిగిలిన డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రాదారుల‌తో ఆమె ఉన్న సంబంధాలు, వారితో జ‌రిపిన సంప్ర‌దింపుల‌పై ఆరా తీయనున్నారు.