సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 సెప్టెంబరు 2021 (22:24 IST)

కాజల్ గర్భందాల్చిందా? అందుకే ప్రాజెక్టులు తగ్గించుకుందా? (video)

టాలీవుడ్ అగ్రనటి కాజల్ అగర్వాల్. తన ప్రియుడని పెళ్లి చేసుకుని వివాహితగా మారింది. ఈమె ప్రస్తుతం గర్భం దాల్చినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ కారణంగానే ఆమె కొత్త ప్రాజెక్టులను ఒప్పుకోవడం లేదనే ప్రచారం సాగుతోంది.
 
తల్లి కాబోతుండడం వల్లే ఈ నిర్ణయం తీసుకుంది అంటూ ప్ర‌చారాలు చేస్తున్నారు. వీటిపై కొన్ని మీమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. కాజ‌ల్ వీటిపై స్పందించ‌క‌పోవ‌డం వ‌ల‌న అవి మ‌రింత ఎక్కువ‌య్యాయి. మ‌రి వీటిపై కాజ‌ల్ వీలైనంత త్వ‌ర‌గా స్పందించాల‌ని అభిమానులు కోరుతున్నారు.
 
కాగా, గత అక్టోబర్ 30, 2020న కరోనా నిబంధనలు పాటిస్తూ తక్కువ మందితో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు‌ని వివాహం చేసుకుంది. ప్ర‌స్తుతం కాజ‌ల్ ప‌ర్స‌న‌ల్ లైఫ్‌తో పాటు ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతుంది. 
 
ప్రస్తుతం నాగార్జున హీరోగా నటిస్తున్న "ది గోస్ట్" సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. అయితే కాజల్ అగర్వాల్ మరియు గౌతమ్ కిచ్లూ త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు అంటూ ఒక బాలీవుడ్ వెబ్ సైట్ ప్రచురించడంతో అభిమానులు కంగుతిన్నారు.