మంగళవారం, 29 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 28 జులై 2025 (20:27 IST)

జగన్ పైన గులకరాయి విసిరిన నిందితుడు కడపలో.., పట్టుకొచ్చారు (video)

Satish has been located in kadapa
2024 అసెంబ్లీ ఎన్నికల పర్యటన సమయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పైన గులక రాయి విసిరి ఆయనకు గాయాలు కావడానికి కారణమైన సతీష్ ఆచూకి లభించింది. తమ కుమారుడు సతీష్ కనిపించడం లేదంటూ ఇటీవలే అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సతీష్ కోసం గాలించారు. దీనితో అతడు కడపలో వున్నట్లు కనుగొన్నారు.
 
కాగా తల్లిదండ్రులు అతడిని మందలించడం వల్ల ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. ఈ నెల 18న ఇంటి నుంచి వెళ్లిపోయిన సతీష్ నేరుగా కడప ఎందుకు వెళ్లాడన్నది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. సతీష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విజయవాడకు తరలించారు.