సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (09:46 IST)

డిగ్రీ చదివే కుమార్తెపై తండ్రి లైంగికదాడి.. భయంతో పరుగెత్తి...

హైదరాబాద్ నగరంలో ఇటీవలికాలంలో మహిళలపై జరుగుతున్న లైంగికదాడుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా డిగ్రీ చదివే యువతిపై కన్నతండ్రే లైంగిక దాడికి యత్నించాడు. ఈ దారుణం ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 17 ఏళ్ల బాలిక ఓ కాలనీలోని ఓ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ తల్లిదండ్రులతో కలిసివుంటుంది. 
 
ఈ బాలిక తండ్రి కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో పెళ్లీడుకొచ్చిన కుమార్తెపై కన్నేసిన కన్నతండ్రి... గురువారం ఇంట్లో ఒంటరిగా ఉన్న కుమార్తెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో భయపడిన బాలిక బయటకు పరిగెత్తి.. పక్కింటి మహిళకు జరిగిందంతా చెప్పింది. 
 
అలా ఈ విషయం స్థానికులకు తెలిసి నిందితునికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటనపై బాలిక తల్లి ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. పోక్సో చట్టం కింద కేసునమోదుచేసి నిందితున్ని అరెస్ట్ చేశారు.
 
కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న తండ్రులే కొన్ని చోట్ల కుమార్తెలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. వావి వరసలు మరచి కుమార్తెలపైనే కామవాంఛ తీర్చుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఈ తరహా ఘటనలు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి.