సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 23 సెప్టెంబరు 2021 (21:00 IST)

మ‌హేష్ అభిమానుల‌కు పండుగ‌- 31 థియేట‌ర్ల‌లో దూకుడు

Mahesh fans celebrations
మహేష్ బాబు కెరీర్ లో `దూకుడు` సినిమా ఎంత‌టి హిట్ తెలిసిందే. ఇదేరోజు విడుద‌లైన ఈ సినిమా ప‌దేళ్ళు పూర్తి చేసుకుంది. అందుకు ఇదేరోజున ఆ చిత్ర నిర్మాత‌లు అనిల్ సుంకర, రామ్ ఆచంట లు మ‌హేష్ అభిమానుల కోరిక మేర‌కు సినిమాను ప‌లు థియేల‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శించారు. హైద‌రాబాద్‌లోని ఆర్‌.టి.సి. క్రాస్ రోడ్‌లోని థియేట‌ర్ల‌లో తొలిసారిగా మ‌హేస్‌బాబు సినిమా రిలీజైతే ఎలా వుంటుందో అంత సంద‌డి నెల‌కొంది. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల‌లో 31 థియేట‌ర్ల‌లో ఈ సినిమాను ఈరోజు ప్ర‌ద‌ర్శించారు. 
 
Fan noise inside the theater
ఈరోజును పుర‌స్క‌రించుకుని చిత్ర ద‌ర్శ‌కుడు శ్రీ‌నువైట్ల కీలక వ్యాఖ్యలు చేశారు. దూకుడు చట్టం కి దశాబ్దం గడిచింది అంటే నమ్మలేకున్నా అని అన్నారు. మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ తో, వెలకట్టలేని మద్దతు తో సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ విషయాన్ని సాధ్యం చేశారు అంటూ చెప్పుకొచ్చారు. అదే విధంగా తన ప్రియమైన స్నేహితుడు అనిల్ సుంకర, రామ్ ఆచంట కి మరియు టీమ్ అందరికీ కూడా థాంక్స్ అంటూ ట్వీట్ చేశాడు.
 
ఇక చిత్ర నిర్మాత‌లు అయితే మ‌రింత ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. ఇదేరోజు తాము దూకుడుతో నిర్మాత‌లుగా ముందుకు వ‌చ్చాము. ప‌దేళ్ళ అయింది. ఎన్నో స‌క్సెస్ సినిమాలు చేశాం. అందుక‌నే ఈరోజు గుర్తుగా `మ‌హా స‌ముద్రం` చిత్రం ట్రైల‌ర్‌ను కొండాపూర్‌లోని ఎ.ఎం.బి.మాల్‌లో అభిమానుల స‌మ‌క్షంలో విడుద‌ల చేశారు. దీనికి మ‌రింత ఆద‌ర‌ణ నెల‌కొంది.