మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (15:44 IST)

ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రామ్‌లో మహేష్ బాబు?

ప్రముఖ టీవీలో ప్రసారమవుతున్న కార్యక్రమం ఎవరు మీలో కోటీశ్వరులు. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మరో టాలీవుడ్ హీరో మహేష్ బాబు గెస్ట్‌‍గా రానున్నారు. 
 
ఇప్పటికే ఈ దఫా సీజన్‌లో మొదటి ఎపిసోడ్‌లో హీరో రామ్ చరణ్ పాల్గొన్నారు. సోమవారం ప్రారంభం కాబోయే ఎపిసోడ్‌లో దర్శక దిగ్గజాలు రాజమౌళి, కొరటాల శివలు గేమ్ ఆడనున్నారు.
 
ఈ నేపథ్యంలోనే మహేశ్ బాబుతోనూ షో నిర్వాహకులు ఒక ఎపిసోడ్ ప్లాన్ చేసినట్టు సమాచారం. గేమ్ ఆడేందుకు మహేశ్ కూడా ఓకే అనేశారని సమాచారం. 
 
మహేష్ బాబుతో తీసే ఎపిసోడ్ దసరా రోజున ప్రసారం చేయనున్నట్టు సమాచారం. అతి త్వరలోనే మహేశ్ గేమ్‌ను షూట్ చేయనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల టాక్.