1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (17:33 IST)

ప్రిన్స్ ఆస్తులు తెలిస్తే కళ్లు తిరుగుతాయ్

ప్రిన్స్ అంటూ అందరూ ముద్దుగా పిలుచుకునే మహేష్ బాబు ఆస్తులు ఈ మధ్య బాగానే పెరిగాయట. అందులోను సినిమాలే కాదు యాడ్స్ లోనూ నటిస్తూ రెరండు చేతులా సంపాదిస్తున్నాడు మహేష్ బాబు. తండ్రి ఆస్తి కన్నా తన ఆస్తిని మరింత రెట్టింపు చేసుకున్నాడు.
 
ప్రతి సంవత్సరం సినిమాల ద్వారానే 35 నుంచి 40 కోట్లరూపాయాలు సంపాదిస్తున్నాడట మహేష్ బాబు. తండ్రి ఘట్టమనేని ఆస్తులు 2,500 కోట్ల రూపాయలు ఉంటే మహేష్ బాబు ఆస్తులు 8 వేల కోట్లకు చేరిందట. 
 
అయితే క్రిష్ణ గతంలో అప్పులు చేయడంతో వాటిని చెల్లించాల్సి వచ్చిందట. అందులోను స్థలాలు కొనడమంటే మహేష్ బాబుకు ఇష్టమట. దీంతో హైదరాబాద్, చెన్నై లాంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా స్థలాలను కొనుగోలు చేశాడట.
 
అంతేకాదు చెన్నైలో 50 కోట్ల రూపాయల విలువ చేసే రెండు ఇళ్ళు కూడా ఈ మధ్యనే కొనుగోలు చేశాడట. భారీ వెంచర్ వేసి వాటిని అమ్మబోతున్నారట మహేష్ బాబు. రియల్ ఎస్టేట్ వెంచర్లలోనే ఎక్కువగా సంపాదించాలన్న ఆలోచనలో ఉన్నారట మహేష్ బాబు.