గురువారం, 25 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 31 ఆగస్టు 2021 (13:36 IST)

అందుకే ప్రతీ వారూ శ్రీదేవి సోడా సెంటర్ చూడాలి: మహేష్ బాబు

Mahesh with sreedevi team
`సర్కారు వారి పాట` సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నా వ్యక్తిగతంగా శ్రీదేవి సోడా సెంటర్ సినిమా యూనిట్ ను కలిసి తన అభినందనలు అందించారు మహేష్ బాబు. త‌న బావ సుధీర్ బాబు న‌టించిన శ్రీదేవి సోడా సెంటర్ సినిమాను తిల‌కించిన మహేష్ బాబు పూర్తి విశ్లేషాత్మ‌కంగా వివ‌రించారు. త‌న‌ను క‌లిసిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌పైప్రశంసల వర్షం కురిపించారు మహేష్ బాబు. సుధీర్ బాబు అద్భుతంగా నటించారని.. ఆయన కెరీర్లో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇదే అంటూ మహేష్ మన్ననలు అందించారు. ఆడవాళ్ళంతా తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది అటు మహేష్ బాబు తెలిపారు. సినిమాలో హీరోయిన్ ఆనంది పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందని.. ఆమె నటన అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు మహేష్ బాబు. శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలో మహిళా ప్రాధాన్యత సన్నివేశాలు చాలా ఉన్నాయి అంటూ తెలిపారు మహేష్ బాబు. 
 
మరీ ముఖ్యంగా సినిమాలో బోట్ సన్నివేశాల గురించి మహేష్ బాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ రేసింగ్ సీన్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. సినిమాలో శ్యామ్‌దత్ సైనుద్దీన్ గారి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుందని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. దాంతో పాటు జైలులో వచ్చే స్యాడ్ సాంగ్ లో ఫైట్ పెట్టడం అద్భుతమైన ఆలోచన అన్నారు మహేష్ బాబు. హీరోయిన్‌కు పెళ్లైపోయింది అని తెలిసినపుడు సుధీర్ బాబు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్.. ఆ పాట అన్నీ మరో స్థాయిలో ఉన్నాయన్నారు మహేష్ బాబు. మణిశర్మ సంగీతం నెక్ట్స్ లెవల్‌లో ఉందని..ఈ సినిమాకు ఆయన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ప్రాణం అని తెలిపారు మహేష్ బాబు. ఈ సినిమాలో ఇలాంటి అద్భుతమైన సన్నివేశాలు సినిమాలో ఇంకా చాలా ఉన్నాయని తెలిపారు మహేష్ బాబు. ఈ సినిమాను అందరూ చూసినపుడే దర్శకుడు చూపించిన విషయం.. చెప్పాలనుకున్న సందేశం ప్రేక్షకులకు బాగా రీచ్ అవుతుందని.అందుకే ప్రతీ ఒక్కరూ శ్రీదేవి సోడా సెంటర్ చూడాలని కోరారు మహేష్ బాబు. తాజాగా హీరో సుధీర్ బాబు, నిర్మాతలు, దర్శకుడు ప్రత్యేకంగా వెళ్లి మహేష్ బాబును కలిశారు. ఇలాంటి అద్భుతమైన సినిమాలు సుధీర్ బాబు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా ఆయన కోరుకున్నారు.