1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 25 ఆగస్టు 2021 (20:14 IST)

నా త‌దుప‌రి సినిమా కూడా తెలుగు వారితోనే తీస్తానుః ద‌ర్శ‌కుడు కరుణ కుమార్‌.

Karuna Kumar
`పరభాషా చిత్రాలు చూసి తెలుగులో ఇలాంటి సినిమాలు ఎందుకు రావడం లేదనే క్వశ్చన్‌ మొదలయ్యింది. ఎంతసేపు ఆ సినిమాల‌నే మెచ్చుకొంటున్నాం. శంకరాభరణం, సిరివెన్నెల, జ్యోతి, విజేత, చాలెంజ్‌ లాంటి లిటరేచర్‌ బేస్డ్‌ సినిమాలు అలాగే లిటరరీ పీపుల్స్‌ ని ఇన్వాల్వ్‌ చేసినన్ని సినిమాలు తెలుగులో వచ్చినంతగా ఏ భాషలో రాలేదు. ప్రపంచాన్ని షేక్‌ చేసిన బాహుబలి, అరుంధతి చిత్రాలు కూడా తెలుగులోనే ఇచ్చామని` దర్శకుడు కరుణ కుమార్ తెలియ‌జేస్తున్నాడు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సినిమా  ‘శ్రీదేవి సోడా సెంటర్‌`. సుధీర్‌ బాబుతో విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు. ఈనెల 27న విడుద‌ల‌కానున్న సినిమా గురించి ద‌ర్శ‌కుడు ప‌లు విష‌యాలు వెల్ల‌డించారు.
 
- తెలుగు నిర్మాతలు ఎప్పుడూ కొత్త కథ చెప్తే వినడానికి సిద్ధంగా ఉంటారు. బాగా తెలిసిన అంశాన్ని తీసుకొని సినిమాటిక్‌గా చెప్పుదామని ‘‘పలాస’’ సినిమా చేశాను. ఈ సినిమాలో కూడా బలమైన సమస్యనే చర్చించాం. దీనికి నాకు బలమైన నిర్మాతలు దొరికారు. ఈ సినిమా పూర్తి విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌ కాబట్టి నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసుకొని ఈ సినిమా చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పక్కన ఉన్న గ్రామాలు ఇప్పటివరకు మనం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల అంటే అరిటాకులు, అరిసెలు, బొబ్బట్లు, అమ్మమ్మ ల ఆప్యాయతలు, పొలం గట్లు, మంచి మనసులు అవే ఫిక్స్‌ అయిపోయాము.
 
- కానీ తూర్పుగోదావరి జిల్లా చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే కమ్యూనిటీస్‌ వాళ్ల మధ్య ఉండే భావోద్వేగాల మధ్య కథ నడుస్తుంటే ఆ కథలో భాగంగా ఈ ప్రేమ కథ ఉంటుంది. కానీ తూర్పు గోదావరి వారిలో కూడా అన్ని రకాలైన ఎమోషన్స్‌ , భావోద్వేగాలు, వివక్ష, రాజకీయాలు, ఘోరమైన ఇన్సిడెంట్స్‌ కూడా ఉంటాయని ఈ సినిమాలో చూపెట్టడం జరిగింది. మేము ఎంచుకున్న లొకేషన్స్‌ శ్యామ్‌ దత్‌ గారి లాంటి అద్భుతమైన కెమెరామెన్‌ తో మేము సక్సెస్‌ అయ్యాను అని అనుకుంటున్నాను.
 
- ఒక సోడా సెంటర్‌ యజమాని కూతురు హీరోయిన్‌. గ్రామాల్లో అల్లరి చిల్లరిగా కనిపించే తెలివైన సాధారణమైన ఒక ఎలక్ట్రీషియన్‌ హీరో. ఆ అబ్బాయి కూడా ఒక మంచి వ్యాపారం పెట్టుకొని పెద్ద స్థాయికి వెళ్లి ఆ వ్యాపారానికి వాళ్ళ అమ్మ పేరు పెట్టుకొవాలనే డ్రీమ్‌ ఉంటుంది. అలా ఉన్న  వీరి మద్యన చిగురించిన  ప్రేమే ఈ శ్రీదేవి సోడా సెంటర్‌. ఆ తర్వాత ప్రేమ తాలూకు పర్యవసనాలు దాని వెనుక ఉండే సాంఘిక, సామాజిక, ఆర్థిక పరమైన ఇబ్బందుల మధ్య వాళ్ళు ఏమయ్యారు అనేది ఈ సినిమా కథ. 
 
- సుధీర్‌ బాబు ఇప్పటి వరకు 12 సినిమాలు చేశాడు. ప్రతి సినిమాకు ఒక వైవిధ్యంతో కొత్త ప్రయత్నం చేయడానికి తపిస్తాడు. పలాస సినిమా చూసి సినిమా బాగుందని నన్ను ఆఫ్రిసియేట్‌ చేసి మీ నెక్స్ట్‌ ప్రాజెక్ట్స్‌ గురించి అడిగాడు. అయితే  నాదగ్గరున్న వాటిలో రెండు కథలు చెప్పాను. వాటిలో ఒకటి శ్రీదేవి సోడా సెంటర్‌. ఈ కథ నచ్చి ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు. 
 
- కొంతమంది దగ్గర నుంచి కొన్ని ఇన్పుట్స్‌ తీసుకొని, అక్కడి భాష, బాడీ లాంగ్వేజస్‌ అలాగే ఎలక్ట్రిషన్‌లో కూడా కొన్ని మెళుకువలు నేర్చుకొని ఆయన నటించడం జరిగింది. ఈ సినిమాలో ఒక రోప్‌ కూడా వాడకుండా ఫైట్స్‌ ,అన్ని కూడాచాలా రిస్కీ గా తీసుకొని వర్క్‌ చేశాడు.
 
నేను తీసే ప్రతి సినిమా కి డిఫరెంట్‌ ఉండాలని కోరుకుంటాను. నేను రాసుకున్న కథలన్నీ కూడా కథే హీరో. నన్ను, నా కథను నమ్మిన వారితోనే నేను సినిమాలు చేస్తాను. నేను తీసిన పలాసలో మొత్తం తెలుగు వాళ్లే .ఇందులో ఇందులో కూడా 99% తెలుగువారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. ఒక్క విలన్‌ తప్ప  తనకి కరోనా రావడంతో వేరే విలన్‌ ను పెట్టుకోవడం జరిగింది.నా నెక్స్ట్‌ మూవీలో కూడా తెలుగువారితోనే చేస్తా.
 
- మణి శర్మ గారిని మొదటిసారి కలిసి కథ చెప్పాను. బ్రేక్‌ టైంలో 10 నిమిషాల్లో  ‘చుక్కల మేళం’ ట్యూన్‌ రెడీ చేసి వినిపించారు. ఈ సినిమా ద్వారా ఆయన మ్యూజిక్ తో కొత్త మణి గారిని చూస్తారు.
 
- నిర్మాత  నాకు పది రూపాయలు అయ్యే ఖర్చును నేను ఎనిమిది రూపాయలకే చేసి పెడతాను. నాకు ఈ  ప్రొడక్షన్‌ హౌస్‌ అంత ఫ్రీడమ్‌ ఇచ్చింది. ప్రజలకు మంచి కథ చెప్పాము అందరికీ మా కథను ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు.