1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 19 ఆగస్టు 2021 (16:08 IST)

మహేష్ బాబు ఆవిష్క‌రించిన‌ శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్(Video)

సుధీర్ బాబు, ఆనంది ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్న `శ్రీదేవి సోడా సెంటర్` సినిమా ట్రైలర్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆవిష్క‌రించారు. కరుణ కుమార్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 27న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది.
ట్రైల‌ర్‌లో ఏముందంటే..
 
'శ్రీదేవి నాది.. నాదే.. 'నా శ్రీదేవికి పెళ్లి చేస్తార్రా..?'
అంటూ సుధీర్ బాబు చెప్పే డైలాగులకు మంచి స్పందన వస్తుంది. శ్రీదేవి సోడా సెంటర్ సినిమాకు అదిరిపోయే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇండియా వ్యాప్తంగా శ్రీదేవి సోడా సెంటర్ సినిమాకు చాలా మంచి బిజినెస్ జరిగింది. ఈ సినిమా థియెట్రికల్ రైట్స్ ఫాన్సీ ప్రైస్ కు అమ్ముడయ్యాయి. సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, బ్రిడ్జ్ ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత లక్ష్మణ్ శ్రీదేవి సోడా సెంటర్ హక్కులను సొంతం చేసుకున్నారు. 
 
కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలవుతున్న సినిమాను వీలైనంత వరకు భారీగానే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు లక్ష్మణ్. ఈయన ఈ మధ్యే విడుదలై బ్లాక్‌బస్టర్ అయిన జాతి రత్నాలు సినిమాను లక్ష్మణ్ డిస్ట్రిబ్యూట్ చేసారు. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్.