శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 ఆగస్టు 2021 (10:51 IST)

హ్యాపీ బర్త్ డే టు ఎవర్‌గ్రీన్ ఛార్మర్ : మహేష్‌కు చిరు విషెస్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. "హ్యాపీ బర్త్ డే టు ఎవర్‌గ్రీన్ ఛార్మర్. ఇది మీకు బ్లాక్ బస్టర్ ఇయర్ కావాలి." అంటూ చిరు టీట్ ద్వారా మహేష్‌కి శుభాకాంక్షలు తెలిపారు. 
 
ఇక సూపర్ స్టార్ నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా నుంచి బ్లాస్టర్ వచ్చి ట్రెండ్ అవుతోంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఇందులో 'మహానటి' కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 13, 2022న భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.
 
మరోవైపు, మహేశ్ బాబు హీరోగా 'సర్కారువారి పాట' నిర్మితమవుతోంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ రోజున మహేశ్ బాబు బర్త్ డే .. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి 'బర్త్ డే బ్లాస్టర్' పేరుతో టీజర్‌ను రిలీజ్ చేశారు.