బుధవారం, 21 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 ఆగస్టు 2021 (22:36 IST)

ఆచార్య నుంచి కొత్త పోస్టర్.. ఇక రెండు పాటలో మిగిలాయి

Acharya
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అలాగే రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. 
 
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిందని...ఇక రెండు పాటలు మాత్రమే బ్యాలన్స్ ఉందని తెలుపుతూ. చిరంజీవి రామ్ చరణ్ అడవులలో కూర్చున్న ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాకు లాంగ్ గ్యాప్ తరువాత మణిశర్మ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నిర్మిస్తోంది. ఈ సినిమా విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.