మంగళవారం, 21 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

election
హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఉపఎన్నికకు సంబంధించి నామినేషన్ల గడువు మంగళవారంతో ముగిసింది. ఈ గడువు ముగిసే సమయానికి మొత్తం 150కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు. అలాగే, ప్రధాన పార్టీలతోపాటు స్వతంత్రులు, రీజనల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) బాధిత రైతులు, ఓయూ, నిరుద్యోగ సంఘాల నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. 
 
మంగళవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత నుంచి గేటు లోపల ఉన్నవారికే నామినేషన్‌ వేసేందుకు అనుతించారు. దాఖలైన నామినేషన్లను రేపటి నుంచి రిటర్నింగ్ ఆఫీసర్ సాయిరాం పరిశీలించనున్నారు. ఈ నెల 24వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు గడువు ఉంది. నవంబరు 11వ తేదీ ఈ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. కాగా, బీఆర్ఎస్‌కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే మాంగటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెల్సిందే.