శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 సెప్టెంబరు 2021 (12:03 IST)

మ‌హ‌ర్షి సినిమాకు మూడు అవార్డులు.. ఉత్త‌మ న‌టుడిగా ప్రిన్స్

సాక్షి ఎక్స‌లెన్స్ అవార్డ్స్ ఫంక్ష‌న్ నిన్న హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ అవార్డ్స్ ఫంక్ష‌న్‌లో మ‌హేష్ బాబు హీరోగా న‌టించిన మ‌హ‌ర్షి సినిమాకు మూడు అవార్డులు వ‌చ్చాయి. ఈ సినిమాలో హీరోగా న‌టించిన మ‌హేష్ బాబు ఉత్త‌మ న‌టుడిగా అవార్డును ద‌క్కించుకున్నారు. 
 
అదేవిధంగా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన వంశీ పైడిప‌ల్లి ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా అవార్డును అందుకున్నారు. 2019లో విడుద‌లైన ఈ సినిమాకు ఉత్త‌మ చిత్రంగా కూడా అవార్డు ద‌క్కింది.
 
అదే విధంగా దిల్ రాజు ఈ సినిమాకు అవార్డును అందుకున్నారు. ఇక అవార్స్ ఫంక్ష‌న్‌లో మ‌హేశ్ బాబు సంద‌డి చేశారు. మ‌హేశ్ బాబు ప్ర‌స్తుతం స‌ర్కారు వారి పాట‌ సినిమా షూటింగ్ లో ఉండ‌టంతో అదే లుక్ లో క‌నిపించి ఆక‌ట్టుకున్నారు. 
 
ఇదిలా ఉండ‌గా స‌ర్కారు వారి పాట సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమా టీజ‌ర్‌ను ఇప్ప‌టికే విడుద‌ల చేయ‌గా ఆక‌ట్టుకుంది. ఈ సినిమాను 2022 సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేయ‌నున్నారు.