మహేష్ చేతుల మీదుగా 23న 'పెళ్లిసందD' ట్రైలర్ రిలీజ్
సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా 'పెళ్లి సందD' సినిమా రూపొందింది. ఆర్కా మీడియా నిర్మించిన ఈ సినిమాతో, గౌరీ రోణంకి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
గతంలో శ్రీకాంత్ హీరోగా పెళ్లి సందడి సినిమాను తెరకెక్కించి భారీ విజయాన్ని అందుకున్న దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, ఈ సినిమాకి దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. అంతేకాదు ఒక ముఖ్యమైన పాత్రను కూడా పోషించారు.
గతంలో ఆయనతో పెళ్లి సందడి సినిమాకి పనిచేసిన కీరవాణి, చంద్రబోస్ ఈ సినిమాకి కూడా పనిచేయడం విశేషం. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన అప్‌డేట్స్ ఆసక్తిని పెంచుతూ వెళుతున్నాయి.
ఇపుడు ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ట్రైలర్‌ను హీరో మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్ చేయించనున్నారు. ఈ సినిమాతో శ్రీలీల తెలుగు తెరకి కథానాయికగా పరిచయమవుతోంది. శ్రీకాంత్ మాదిరిగానే ఆయన తనయుడికి ఈ టైటిల్ కలిసొస్తుందేమో చూడాలి.