ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపించాడుః అమీర్‌ఖాన్
chaitu,saipallavi, ameerkhan, chiru
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా "లవ్ స్టోరి". ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల కాలంలో చూస్తే థియేటర్ లలో రిలీజ్ అవుతున్న ప్రతిష్టాత్మక సినిమా "లవ్ స్టోరి" అనుకోవచ్చు. రేవంత్, మౌనికల ప్రేమ కథను తెరపై చూసేందుకు ఆడియెన్స్ వెయిటింగ్ ముగుస్తోంది. సెప్టెంబర్ 24న "లవ్ స్టోరి" థియేటర్ భారీ స్థాయిలో రిలీజ్ కు రెడీ అవుతోంది. చిత్ర ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. తాజాగా "లవ్ స్టోరి" అన్ ప్లగ్ డ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటళ్లో గ్రాండ్ గా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ అతిథులుగా హాజరయ్యారు. చిరు, అమీర్ ఖాన్ "లవ్ స్టోరి" టీమ్ కు బెస్ట్ విశెస్ తెలిపారు.
ఈ సందర్భంగా అమీర్ ఖాన్ మాట్లాడుతూ, నాగ చైతన్యను లాల్ సింగ్ చద్దా కోసం ఫస్ట్ టైమ్ కలిశాను. ఆయనతో పనిచేస్తుంటే, ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపించాడు. లవ్ స్టోరి సినిమా కార్యక్రమం కోసం ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. నేనూ మీలాగే లవ్ స్టోరి చిత్రాన్ని ఈ నెల 24న చూస్తాను. అదీ థియేటర్ లలోనే. మహారాష్ట్రలో థియేటర్స్ ఇంకా ఓపెన్ అవలేదు. కానీ ప్రత్యేకంగా స్క్రీనింగ్ వేసుకుని చూడాలని అనుకుంటున్నాను. మొత్తం టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. శేఖర్ కమ్ముల మీద ఇక్కడికి వచ్చిన అతిథులు చూపిస్తున్న ప్రేమ నన్ను కదిలిస్తోంది.
సాయి పల్లవి పాటలు కొన్ని యూట్యూబ్ లో చూశాను. కానీ ఆమె సినిమాలు నేను ఇంకా చూడలేదు. ఆమె సినిమా పాటలోని ఫస్ట్ క్లిప్ చూసినప్పుడు సాయి పల్లవికి ఫ్యాన్ అయ్యాను. లవ్ స్టోరి సినిమా సంగీత దర్శకుడు, ఎడిటర్, డీవోపీ అండ్ ఆల్ కాస్ట్ అండ్ క్రూకు ఆల్ ద బెస్ట్. అన్నారు.
సంగీత దర్శకుడు పవన్ సీహెచ్ మాట్లాడుతూ...మా సినిమా కార్యక్రమానికి అమీర్ ఖాన్ గారు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. "లవ్ స్టోరి" పాటలు ఇంత పెద్ద విజయం సాధించాయంటే అందుకు కారణం దర్శకుడు శేఖర్ కమ్ముల గారు. నాపై నమ్మకం ఉంచినందుకు ఆయనకు థాంక్స్. కేవలం సంగీతమే కాదు శేఖర్ గారితో జర్నీ చేసిన ఈ రెండేళ్లలో మంచి మనిషిగా కూడా మారాను. ఇదొక మెమొరబుల్ జర్నీ నాకు. మా సినిమాకు మంచి సాంగ్స్ రాసిన లిరిసిస్ట్స్ అందరికీ థాంక్స్. అన్నారు.