శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 సెప్టెంబరు 2021 (18:09 IST)

అబ్బే.. చై.. శామ్‌పై విడాకుల వార్తలా.. లవ్ స్టోరీ ట్రైలర్‌తో..?

హీరో నాగచైతన్య, సంమతలు విడిపోయారని కొద్దిరోజులుగా వస్తున్న వార్తలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. ఈ గాసిప్స్‌పై ఇంతవరకూ చై కానీ, శామ్ కానీ స్పందించకపోవడంతో సోషల్ మీడియా వేదికగా బ్రేకప్ రూమర్లు విపరీతంగా చక్కర్లు కొట్టాయి. 
 
అయితే, ఈ గాసిప్స్‌కు లవ్ స్టోరీ ట్రైలర్ ఎండ్ కార్డ్ వేసింది. ఇవాళ విడుదలైన ఈ ట్రైలర్‌ మంచి టాక్ తెచ్చుకోవడంతో చైతన్య ట్వీట్‌ను రీ ట్వీట్ చేసింది సమంత. నాగచైతన్యకు ఆలి ది బెస్ట్ చెబుతూ శామ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఇకపోతే.. టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ లవ్ స్టోరీ ట్రైలర్ ఇవాళ విడుదలైంది. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ క్రేజీ మూవీలో హీరోగా నాగచైతన్య, హీరోయిన్‌గా సాయిపల్లవి నటిస్తున్నారు. మరోసారి శేఖర్ కమ్ముల గ్రామీణ నేపధ్యంలో సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. 
 
ఈ ట్రైలర్‌లో నాగచైతన్య చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. '' రిక్షా తొక్కుకునేటోడికి కొత్త రిక్షా కొనిస్తే రిక్షానే తొక్కుకుంటాడు. గొర్లు మేపుకునేవాడికి గొర్లు కొనిస్తే గొర్లనే మేపుకుంటాడు. ఇలా అయితే మేమెలా డెవలప్ అవుతాం సర్'' అని నాగ చైతన్య చెప్పిన డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజెన్స్‌ని ఆకర్షిస్తోంది. ఇక.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.