బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 సెప్టెంబరు 2021 (11:18 IST)

జార్ఖండ్‌లో పిడుగుపాటు.. 30 పశువులు మృతి

దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జార్ఖండ్‌లోని గిరిడీహ్ జిల్లాలోని రెండు ప్రాంతాల్లో పిడుగుపాటుకు 30 పశువులు మృతి చెందాయి. గరంగ్ ఘాట్‌లో పిడుగు పాటుకు 22 పశువులు మృతి చెందగా, జమువాలో 8 పశువులు మృతి చెందాయి. 
 
పిడుగుపాటు ఘటనల్లో పశువులకు కోల్పోయిన వాటి యజమానులు తమకు నష్టపరిహారం అందజేయాలని అధికారులను వేడుకుంటున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం దేవరి పరిధిలోని గరంగ్‌ఘాట్‌లో కొందరు వ్యక్తులు పశులను మేత కోసం వదిలిపెట్టారు. 
 
ఇంతలో వాతావరణం ఒకసారిగా మారిపోయి పిడుగులు పడ్డాయి. ఈ ఘటనలో ఆవులు, గేదెలు, మేకలు మృతి చెందాయి. ఇదేవిధంగా జమువా పరిధిలో పడిన పిడుగుపాట్లకు పలు పశువులు మృతి చెందాయి.