శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 ఆగస్టు 2021 (18:09 IST)

మామయ్య అని సుధీర్‌ను గట్టిగా పిలిచిన యాంకర్ రష్మీ..!?

జబర్దస్త్ యాంకర్ రష్మీ, కమెడియన్ సుధీర్ లవ్వాయణం గురించి తెలిసిందే. తాజాగా సుధీర్‌ను మామ అని పిలిచింది రష్మీ. జబర్దస్త్‌లోనే కాకుండా ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షోలో కూడా సుధీర్, రష్మీ టీం లీడర్‌గా చేస్తున్నారు. ఇక ఇందులో వీరిద్దరు కలిసి తెగ రొమాన్స్‌లతో బాగా రెచ్చిపోతారు.

కానీ ఇదంతా కేవలం షో కోసం మాత్రమే చేస్తుంటామని.. ప్రేక్షకులను మరింత ఆకట్టుకోవడానికి మాత్రమే ఇలా పర్ఫామెన్స్ చేస్తుంటామని.. అంతేకానీ మా మధ్య ఎటువంటి రిలేషన్ లేదు అని చాలాసార్లు పలు ఇంటర్వ్యూలలో తెలిపారు.
 
కానీ కొందరు ప్రేక్షకులు మాత్రం వీరి మధ్య జరిగే కొన్ని సీన్‌లను చూసి వీరిపై తెగ మండిపడుతున్నారు. ఎంత షో కోసమైనా ఇలా ప్రవర్తించడం కరెక్టు కాదు అని ఎన్నో కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా వాళ్లు మాత్రం తమ రొమాన్స్‌లతో ఇంకా రెచ్చిపోతూనే ఉన్నారు. అలా ఏ షో లోనైనా ఈ జంట చేసే రచ్చకు మాత్రమే కొందరు అభిమానులు షో లను చూస్తుంటారు.
 
ఇదిలా ఉంటే తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో విడుదలయింది. ఇందులో కొందరు పిల్లలు ఎంట్రీతో బాగా సందడి చేయగా.. అందులో సుడిగాలి సుధీర్ వారితో కొన్ని మాటలు మాట్లాడి రివర్స్ తనే పంచ్‌లు వేయించుకున్నాడు. 
 
ఇక.. ఏది ఒకసారి మామయ్య అనండమ్మా అని అనేసరికి పిల్లలందరూ మామయ్య అని గట్టిగా పిలిచారు. ఇక పిల్లలు తర్వాత రష్మీ గట్టిగా మామయ్య అని సుధీర్‌ను పిలిచింది. వెంటనే సుధీర్ తనకు తల వంచి వద్దు అన్నట్లు దండం పెట్టగా.. అక్కడున్న వాళ్లంతా తెగ నవ్వుకున్నారు.