గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 జూన్ 2021 (13:38 IST)

KGF విడుదల తేది ఖరారు: సెప్టెంబర్ లేదా డిసెంబర్‌లో విడుదల

కేజీఎఫ్ 2 విడుదల తేది ఖరారైంది. బాహుబలితో ప్రభాస్‌కు ఏ విధంగా నేషనల్ వైడ్ పాపులారిటీ వచ్చిందో.. ‘కేజీఎఫ్’ సినిమాతో యశ్ అదే రేంజ్‌లో పాపులార్ అయ్యారు. ఈ చిత్రం సృష్టించిన సంచలనాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఈ సినిమా కన్నడలో తొలి రూ. 230 కోట్లు కొల్లగొట్టిన సినిమాగా రికార్డు క్రియేట్  చేసింది. అంతేకాదు హిందీలో దాదాపు రూ. 50 కోట్లకు పైగా కొల్లగొట్టింది.  
 
కేజీఎఫ్ మొదటి భాగానికి వచ్చిన రెస్పాన్స్‌తో రెండో పార్ట్‌ను మరింత పకడ్బందీగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. అందుకే ఈ సినిమాలో పలు భాషలకు చెందిన నటీనటులు నటిస్తున్నారు. ఇక కేజీఎఫ్ చాప్టర్-1లో మెయిన్ విలన్ బ్రదర్ పాత్రలో అధీరా అనే పాత్రను చూపించారు. 
 
కానీ ఆ క్యారెక్టర్ చేసింది ఎవరో రివీల్ చేయలేదు. ఆ పాత్రకు ఉన్న ప్రాముఖ్యతను దృష్టిని ఈసినిమాలో బాలీవుడ్ బడా హీరో సంజయ్ దత్‌తో అథీరా పాత్ర కోసం తీసుకున్నారు. మరోవైపు ప్రధాన మంత్రి పాత్రలో రవీనా టాండన్ పవర్‌ఫుల్ రోల్ ప్లే చేస్తోంది. ఇప్పటికే  విడుదలైన టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
 
ఇప్పటికే ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి రూ. 200 కోట్ల వరకు బిజినెస్ చేసింది. ఇక అన్ని భాషల్లో డిజిటల్, శాటిలైట్ రైట్స్ అదనం. ఆ సంగతి పక్కన పెడితే..  ఈ సినిమాను ముందుగా జూలై 16న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా కూడా విడుదల వాయిదా పడింది. 
 
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన యశ్ డబ్బింగ్ కూడా మొదలు పెట్టాడు. మరోవైపు హిందీలో కూడా యశ్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటాడంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లేదా డిసెంబర్‌లో ఎవరు పోటీలేని టైమ్‌లో కేజీఎఫ్ విడుదలైన డేట్‌లో విడుదల చేయాలని చూస్తున్నారు.