బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 24 జూన్ 2021 (12:30 IST)

సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంట‌గా నరుడి బ్రతుకు నటన

Siddu, neha sarma
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహాశెట్టి నాయికగా సితార ఎంటర్టైన్ మెంట్ బేన‌ర్‌పై `న‌రుడి బ్రతుకు నటన' చిత్రం రూపొందుతోంది. గురువారం హైదరాబాద్ లో ఈ' చిత్రం షూటింగ్ ఈరోజు పునః ప్రారంభం అయింది. కథానాయకుడు సిద్దు పాల్గొనగా సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. నేహాశెట్టి‘ నాయికగా న‌టిస్తోంది.'కృష్ణ అండ్ హిజ్ లీల' చిత్రానికి రచయిత గానూ, దర్శకత్వ శాఖలో పనిచేసిన విమల్ కృష్ణ ను ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశి. కొత్త తరం రొమాంటిక్ ప్రేమకథా చిత్రమిది అంటున్నారు  దర్శకుడు విమల్ కృష్ణ.చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో ప్రిన్స్, బ్రహ్మాజీ, నర్రాశ్రీనివాస్ నటిస్తున్నారు.
 
మాటలు: సిద్దు జొన్నలగడ్డ, సంగీతం: శ్రీచరణ్ పాకాల, ఛాయాగ్రహణం: సాయిప్రకాష్ ఉమ్మడి సింగు
ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలి నేని, సమర్పణ: పి. డి. వి. ప్రసాద్,