శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 జూన్ 2021 (12:16 IST)

సమంత కష్టం పండింది.. వరల్డ్ రికార్డు కొట్టిన ఫ్యామిలీ మ్యాన్ 2

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత కష్టం పండింది. అప్పటి వరకు కనిపించని లుక్‌కు భిన్నంగా.. రాజీగా తను.. వేసిన డేర్ స్టెప్‌ వృధా కాకుండా పోయింది. ఒక్కసారిగా వరల్డ్‌ వైడ్‌ పాపులర్ అయ్యేలా చేసింది. ఫ్యామిలీ మ్యాన్‌2 సిరీస్‌ కోసం రా అండ్ బోల్డ్‌ క్యారెక్టర్‌లో నటించిన సామ్… ఈ సిరీస్‌ సూపర్‌ డూపర్ హిట్ అవ్వడానికి వన్‌ ఆఫ్‌ ది మేజర్ ఎలిమెంట్‌గా మారారు. సిరీస్‌లో మెయిన్‌ లీడ్స్‌ మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియమణిలకు తోడు సామ్‌ నటించి సీరీస్‌కు ఓ ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేశారు.
 
తాజాగా సమంత డెబ్యూ వెబ్ సిరీస్ సంచలనాలు సృష్టిస్తుంది. ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ తో సమంత అరుదైన రికార్డు అందుకుంది. ప్రముఖ సినిమా రేటింగ్ సంస్థ ఐ ఎమ్ డి బి ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ కి వరల్డ్ టాప్ ర్యాంకింగ్ కట్టబెట్టింది. 
 
ప్రపంచంలోనే అత్యంత పాప్యులర్ సిరీస్లలో ది ఫ్యామిలీ మాన్ 2 నాలుగవ స్థానం అందుకుంది. హాలీవుడ్ కి చెందిన 'లోకి' ఈ లిస్ట్ లో టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఓ ఇండియన్ సిరీస్ హాలీవుడ్ సిరీస్ లకు పోటీ ఇస్తూ ఈ స్థాయి దక్కించుకోవడం అరుదైన విషయమే. సమంత యాక్టింగ్ ఆమె రోల్ సిరీస్ విజయానికి కీలకంగా మారింది. 
 
ఇక ఫ్యామిలీ మ్యాన్ ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టడంతో సమంత ఫుల్ ఖుషీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్లో రాజీ పాత్రలో సూసైడ్ బాంబర్‌గా సమంత జీవించింది. ఎంతలా సమంత మాయ చేసిందంటే తొలి సీజన్‌లో నటించిన మనోజ్ బాజ్పాయ్ ఈ సీజన్లో కూడా ఉన్నా... అతడిని డామినేషన్ చేసింది సమంత.