శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 జూన్ 2021 (18:03 IST)

సమంతపై కోలీవుడ్ గుర్రు : ఆ వెబ్ సిరీస్ ప్రసారం నిలిపివేయాలంటూ..

అక్కినేని సమంత తాజాగా నటించిన వెబ్‌సిరీస్ ది ఫ్యామిలీమెన్-2. ఈ సిరీస్‌పై ఇపుడు తమిళనాటు పెను వివాదం రేగింది. ఈ సిరీస్‌ పట్ల అనేక మంది సినీ రాజకీయ ప్ర‌ముఖులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో సమంత శ్రీలంకకు చెందిన తమిళ యువతిగా నటించింది. ఇందులో ఆమె యాక్షన్ దృశ్యాలలో కూడా కనిపిస్తుంది. 
 
అయితే, ఆమె త‌మిళ యువ‌తిగా నెగెటివ్ రోల్‌లో న‌టించ‌డం ప‌ట్ల త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు మండిప‌డున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌ను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర స‌ర్కారుతో పలు రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేశాయి. 
 
అయిన‌ప్ప‌టికీ ఈ వెబ్‌ సిరీస్‌ ఈ నెల 4 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో న‌డుస్తోంది. ఈ విష‌యంపై తాజాగా సీనియర్‌ దర్శకుడు భారతీరాజా కూడా మండిప‌డ్డారు.
 
తమిళ జాతికి వ్యతిరేకంగా 'ది ఫ్యామిలీ మెన్‌ 2' వెబ్‌ సిరీస్ రూపొందింద‌ని, దాన్ని ప్రసారం చేయకూడద‌ని విజ్ఞప్తి చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ప‌ట్టించుకోకపోవ‌డం బాధాకరమని ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 
 
ఈ వెబ్‌ సిరీస్‌ను తమిళ ద్రోహులు రూపొందించార‌ని అన్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి నిషేధం విధించాలని ఆయ‌న డిమాండ్ చేశారు. లేదంటే తాము అమెజాన్‌ సంస్థపై పోరాటం చేయడానికి కూడా వెనుకాడబోమని స్ప‌ష్టం చేశారు.