ది ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ 2 స్ట్రీమింగ్.. సమంతకు ఫ్యాన్స్ మద్దతు

Samantha Akkineni
Samantha Akkineni
సెల్వి| Last Updated: గురువారం, 3 జూన్ 2021 (17:31 IST)
ది ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ 2 వెబ్ సీరిస్‌ స్ట్రీమింగ్ కానుంది. ఇందులో సమంత అక్కినేని త‌మిళ టెర్ర‌రిస్టుగా న‌టించినందుకు కొంద‌రు నెటిజ‌న్లు ట్రోల్ చేస్తుంటే… మ‌రో ప‌క్క దీని మేక‌ర్స్ రాజ్ అండ్ డీకే ఈ సీజ‌న్‌కు ప్రేక్ష‌కుల నుండి పాజిటివ్ రియాక్ష‌న్ వ‌స్తుంద‌నే ఆశాభావాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

త‌మిళ‌నాడులోని రాజ‌కీయ పార్టీలు, నేత‌లు ఈ వెబ్ సీరిస్ ను బ్యాన్ చేయాల‌ని కోరినా కేంద్రం మాత్రం మౌనం వ‌హించింది. దాంతో మ‌రికొన్ని గంట‌ల్లో ఈ వెబ్ సీరిస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇదే విష‌యాన్ని మేకర్స్ సైతం సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు.

త‌మ వెబ్ సీరిస్ ట్రైల‌ర్ లోనొ కొన్ని స‌న్నివేశాల‌ను చూసి, అపోహ‌ల‌కు గురి కావ‌ద్ద‌న్న‌ది వారి మాట‌. ఈ ప్రాజెక్ట్ లో వ‌ర్క్ చేసిన వారిలో అత్య‌ధిక శాతం మంది త‌మిళులే ఉన్నార‌ని, ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన ప్రియ‌మ‌ణి, స‌మంత‌, ర‌చ‌యిత సుమన్ కూడా ఆ ప్రాంతం వారేనని, వారికి త‌మిళ సంస్కృతి, సంప్ర‌దాయాలంటే అపార‌మైన గౌర‌వం ఉంద‌ని, కాబ‌ట్టి ఏ ప‌రిస్థితుల్లోనూ త‌మిళ‌ల‌ను అవ‌మానించ‌డం అనేది తమ వెబ్ సీరిస్‌లో జ‌ర‌గ‌ద‌ని హామీ ఇస్తున్నారు. ఇక సమంత ఫ్యాన్స్ ఆమెకు మద్దతిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :