శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి

జాంబీ రెడ్డి సినిమాకు సీక్వెల్.. సమంత నటించనుందా..?

తేజ సజ్జ హీరోగా యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రం జాంబీ రెడ్డి. కరోనా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఫుల్ కామెడీను అందించింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం 15 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాలో తెలుగు అమ్మాయి నందినీ, ఢిల్లీ బ్యూటీ దక్షనగర్కర్ హీరోయిన్స్‌గా నటించారు. గెటప్ శీను, హేమంత్, అన్నపూర్ణ ముఖ్య పాత్రల్లో కనిపించారు.
 
జాంబీ జోనర్‌లో వచ్చిన తొలి తెలుగు సినిమా జాంబీ రెడ్డి కాగా, ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రముఖ టీవీ ఛానెల్‌లో ప్రసారం అయింది. దీనికి ఏకంగా 9.7 టీర్పీ వచ్చింది. కొత్త హీరోకు ఈ రేంజ్ టీ ఆర్పీ రావడాన్ని చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.
 
త్వరలో జాంబీ రెడ్డి సినిమాకు సీక్వెల్ ఉంటుందని వార్తలు వస్తుండగా, ఇందులో సమంత నటిస్తుందనే ప్రచారం కూడా నడుస్తుంది. జాంబీ రెడ్డి చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ తన తొలి సినిమాగా అ! అనే సినిమా చేయగా, ఈ చిత్రంతో జాతీయ అవార్డ్ కూడా పొందాడు. అనంతరం రాజశేఖర్ హీరోగా కల్కి అనే సినిమా చేశాడు.