శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 మార్చి 2021 (13:02 IST)

విక్కీ కౌశల్ ఛాలెంజ్.. సమంత స్టెప్స్ అదుర్స్

టాలీవుడ్ హీరోయిన్ సమంత అక్కినేని ఎటువంటి పాత్రలోనైనా ఇట్టే దూరిపోతారు. పరకాయ ప్రవేశం చేసినట్టు పాత్రను పండిస్తారు. తన నటనతో ప్రతి సినిమాలోనూ ప్రేక్షకులకు వినోదాల విందు అందిస్తారు. ఇక డాన్స్ పరంగాను సమంతికి ఇబ్బంది లేదు. అత్యంత కష్టమైన స్టెప్పులను సైతం తన సోంత స్టైల్‌తో చేసి అందరినీ మెప్పిస్తారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఛాలెంజ్‌లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 
 
ఇటీవల బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ ఇచ్చిన ఛాలెంజ్‌ను సమంత స్వీకరించారు. అందులో భాగంగా ఓ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసిన వీడియోను సమంత షేర్ చేశారు. ఈ వీడియోలో సమంత వేసిన బెల్లీ మూవ్‌మెంట్స్ అందిరినీ ఆకట్టుకున్నాయి.
 
నెటిజన్లు ఈ వీడియోను తెగ షేర్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. ఇదిలా ఉంటే సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో టైటిల్ పాత్రలో సమంత కనిపించనున్నారు.