గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 1 మార్చి 2021 (16:25 IST)

వావ్.. రాహుల్ గాంధీ పుషప్స్ కెవ్వు కేక

రాహుల్ గాంధీ 50 ఏళ్ల వయసులోనూ ఫిట్నెస్ విషయంలో అదరహో అనిపించారు. ప్రస్తుతం ఆయన తమిళనాడు ఎన్నికల పర్యటనలో వున్నారు. కేవలం సభలు, సమావేశాల వరకే కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ముందుకు దూసుకువెళుతున్నారు.
 
ఈ క్రమంలో తమిళనాడులోని సెయింట్ జోసెఫ్ స్కూల్ విద్యార్థులో ముచ్చటిస్తున్న సందర్భంలో ఆయనకు పలువురు పదో తరగతి విద్యార్థులు రాహుల్ గాంధీకి ఫిట్‌నెస్ ఛాలెంజ్ విసిరారు. మెరిన్ షెలిఘో అనే విద్యార్థిని రాహుల్‌తో పుష్ అప్స్‌ పోటీకి రంగంలోకి దిగింది. ఇద్దరు పోటా పోటీగా పుష్ అప్స్ తీస్తుండగా బాలిక కంటే రాహుల్ గాంధీ అదుర్స్ అనే రీతిలో పుషప్స్ అదరగొట్టారు.