మార్కెట్ లేని హీరో తేజ సజ్జ, కానీ కోట్లు వచ్చేస్తున్నాయి
అవి గుర్తుకు వచ్చి భావోద్వేగానికి లోనయిన జాంబిరెడ్డి హీరో
ఇంద్ర సినిమాలో బాలనటుడు, సమంత నటించిన `ఓ బేబి`లో కథప్రకారం మనవడుగా నటించాడు తేజ సజ్జ. కట్ చేస్తే రెండో సినిమాకే హీరో అయిపోయాడు. అదే `జాంబిరెడ్డి`. ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్‌లో వుండగానే హీరో ఎవరా! అనుకుంటుండగా దర్శకుడు ప్రశాంత్ వర్మకు తేజ సజ్జ కరెక్ట్ అని చెప్పాడు. సెట్‌పైకి వెళ్ళేందుకు సిద్ధమవుతుండగా నిర్మాతలు ప్రశాంత్‌కు సూచన చేశాడు. అసలు మార్కెట్‌లేని వాడిని హీరోగా చేసి ఏం చేద్దామని చర్చ పెట్టారు.
వెరసి వారు ఆ సినిమానుంచి తప్పుకున్నారు. కానీ దర్శకుడు తేజను హీరోగా నిలబెట్టాలని అనుకున్నాడు. అందుకు కారణం తేజ దర్శకుడికి స్నేహితుడు కావడమే. ఇద్దరూ కలిస్తే సినిమాల గురించే చర్చ. ఆ తర్వాత కొద్ది కాలానికి జాంబిరెడ్డికి రాజశేఖర్ వర్మ ముందుకు వచ్చాడు.
ఇదంతా దర్శకుడికి ప్రతిభే. అలా ఎన్నో కష్టనష్టాలు, మధ్యలో కరోనా, ఇలాంటి సినిమాలు జనాలు చూస్తారా! చూస్తే థియేటర్‌కు వస్తారా! అంటూ టెన్షన్. దానికితోడు మార్కెట్‌లేని హీరోతో సినిమానా! అనే మాటలు వెంటాడుతూనే వున్నాయి. ఇవన్నీ ఒక్కసారి గుర్తుకురాగానే గుండె బరువెక్కడంతోపాటు ఆనందం కూడా పొంగింది. రెండింటిని బేలన్స్ చేసుకోవడం చాలా కష్టమైపోయింది హీరో తేజకు.
శనివారంనాడు జాంబిరెడ్డి సక్సెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ ఒక్కసారిగా మౌనం వహించారు. భావోద్వేగానికి లోనయ్యారు. మాటలు రాలేదు. వెంటనే మైక్‌ను తీసుకుని ప్రశాంత్ వర్మ సినిమా ప్రీ పొడక్షన్ నుంచి రిలీజ్ వరకు వారు పడిన కష్టనష్టాలు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత తేజ మాట్లాడారు.
' ఫస్ట్ టైం కొత్త సినిమా ట్రై చేశావ్.. చాలా బాగుందని 8వేలు ట్వీట్స్ వచ్చాయి. ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్, పెద్దలు అప్రిషియేట్ చేస్తున్నారు. సినిమా నచ్చితే ఏ రేంజ్‌లో ఉంటుందో తెలుగు ప్రేక్షకులు నిరూపించారు. వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం 2.26 క్రోర్స్ కలెక్ట్ చేయడం.. ఒక డెబ్యూ హీరోకి ఈ నంబర్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది.
ఈ క్రెడిట్ అంతా ప్రశాంత్‌కే చెందుతుంది. నా క్లోజ్ ఫ్రెండ్ ప్రశాంత్ వర్మ నాకు చాలా పెద్ద హిట్ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ఈ సక్సెస్‌తో నాకు బాధ్యత, బరువు ఎక్కువైంది. నెక్స్ట్ ఇంకా బెటర్ ఫిలిమ్స్ చేయాలని ఈ సినిమా ప్రేరణ ఇచ్చింది. గెటప్ శ్రీను క్యారెక్టర్ కి థియేటర్లో అరుపులు కేకలు వేస్తున్నారు ఆడియెన్స్.
ఇలాంటి కొత్త కాన్సెప్టుతో సినిమా తీయాలంటే దమ్ము, ధైర్యం కావాలి.. అది ఉన్న నిర్మాత రాజశేఖర్ గారు. జీవితాంతం ఆయనపై నాకు గౌరవం ఉంటుంది. ప్రతీ ఒక్కరూ అద్భుతంగా నటించారు. అలాగే టెక్నీషియన్స్ కూడా ఎంతో సపోర్ట్ చేసి చాలా కష్టపడి చేశారు. వారందరికీ, ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు.