బుధవారం, 13 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 18 జులై 2025 (16:43 IST)

తప్పిపోయిన కుక్క, డ్రోన్ కెమేరాతో వెతికి చూసి షాక్ తిన్నారు (video)

dog playing with bears
వాళ్లు ఓ కుక్కను పెంచుకున్నారు. ఐతే ఓ రోజు ఆ కుక్క కనిపించకుండా పోయింది. దానికోసం వీధులన్నీ గాలించారు. కానీ ఎక్కడ కనబడలేదు. చిట్టచివరకు వారికి ఓ ఐడియా వచ్చింది. వెంటనే ఓ డ్రోన్ తీసుకుని వచ్చి దాన్ని చుట్టుపక్కల ప్రదేశాల్లో వెతికేందుకు పంపారు. ఐతే ఆ కుక్క జనావాసాల్లో ఎక్కడా కనిపించలేదు. దీనితో సమీపంలో వున్న అడవిలోకి పంపారు డ్రోన్.
 
అంతే... ఆ డ్రోన్ తీసిని వీడియో దృశ్యాలు చూసి షాక్ తిన్నారు. తాము పెంచిన కుక్క అడవిలో ఎలుగుబంటిలతో స్నేహం చేస్తూ కనిపించింది. వాటితో ఆడుకుంటూ గెంతులు వేస్తూ జాలీగా వుంది. ఆ కుక్కను వారలా చూసి ఒకింత ఆశ్చర్యపోయారు. చూడండి ఆ వీడియో...