మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 17 ఏప్రియల్ 2021 (15:02 IST)

సమంత అక్కినేని ది గ్రేట్: మహిళా ఆటో డ్రైవరుకి అదిరిపోయే గిఫ్ట్

సమంత అక్కినేని. సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సమంత అక్కినేని సామాజిక సేవలోనూ ముందుంటారు. తన దృష్టిలోకి వచ్చిన పేదల బాధలను తీర్చి వారిని గట్టెక్కించేందుకు తన వంతు కృషి చేస్తుంటారు.
 
తాజాగా సమంత అక్కినేని కవిత అనే లేడీ ఆటో డ్రైవరుకి బంపర్ బహుమతి ఇచ్చారు. దీనికి కారణం కవిత గతం తాలూకు జీవితం సమంతను కదిలించడమే. వివరాల్లోకి వెళితే... గత ఆరు నెలల క్రితం అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. తన జీవితాన్ని అంతా వివరించారు.
 
తన భర్త తాగుబోతు కావడంతో అతడు పూటుగా మద్యం సేవించి తనను హింసించేవాడని పేర్కొంది. దానికితోడు తన తల్లిదండ్రులు కూడా మరణించడంతో తన ఏడుగురు చెల్లెళ్లను బాధ్యత తనపై వేసుకోవాల్సి వచ్చింది.
 
తొలుత వ్యవసాయం పనులు చేసి నెట్టుకొచ్చినా ఆ తర్వాత డబ్బులు చాలకపోవడంతో ఆటో డ్రైవింగ్ నేర్చుకుని దాన్ని నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు వెల్లడించింది. ఇదంతా సమంత దృష్టికి రావడంతో కవితకు కారును కొనిచ్చేశారు. ఈ కారు ఖరీదు రూ. 12.50 లక్షలు. కాగా ఈ వాహనంతో ఆమె జీవితం మరింత సంతోషదాయకంగా మారాలని సమంత ఆకాంక్షించారు.