1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Happy Birthday Priyamani

Happy Birthday Priyamani: ది ఫ్యామిలీ మ్యాన్ 2నే ప్రియామణికి స్పెషల్ గిఫ్ట్

Actress priyamani
‘ది ఫ్యామిలీ మ్యాన్’ అనే వెబ్ సిరీస్‌తో నటి ప్రియామణికి బాలీవుడ్‌లో మంచి గుర్తింపు లభించింది. జూన్ 4వ తేదీ పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియామణికి ఇదే ప్రస్తుతం పెద్ద గిఫ్ట్‌గా మారింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ ఫేమ్ సౌత్ సినిమా నటి ప్రియమణి ఈ రోజు తన పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆయన అభిమానులు ఆమెకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తన సినీ కెరీర్‌లో రకరకాల పాత్రలు చేసింది ప్రియమణి. 
 
గతంలో నితిన్‌తో కలిసి చేసిన ‘ద్రోణ’ చిత్రంలో బికినీ ధరించినప్పుడు పెద్ద సెన్సేషనే క్రియేట్ చేసిన ప్రియమణి ప్రస్తుతం బుల్లితెర డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. నారప్పలో వెంకీ సరసన నటిస్తోంది. తాజాగా దక్షిణ భారతదేశపు ప్రముఖ నటి ప్రియమణి మనోజ్ బాజ్‌పేయి భార్య పాత్రలో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ మొదటి భాగంలో మరియు ఇప్పుడు ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ లో కనిపిస్తుంది. 
 
ప్రియమణి తన సుదీర్ఘ సినీ జీవితంలో చాలా విజయవంతమైన చిత్రాలలో పనిచేసింది. ఆమె నటనకు మంచి గుర్తింపు వుంది. 2019 సంవత్సరంలో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ అనే వెబ్ సిరీస్‌లో ప్రియమణి పాత్రకు ప్రశంసలు అందాయి. అలాగే ప్రియమణి పుట్టిన రోజు సందర్భంగా ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ విడుదలైంది. ఇందులోనూ ప్రియమణి పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 
 
ఇకపోతే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాతో హీరోయిన్‌‌గా పరిచయం అయ్యింది అందాలభామ ప్రియమణి. ప్రస్తుతం తెలుగు తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తున్న ప్రియమణి ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో బిజీగా గడుపుతుంది. ప్రియమణి ప్రస్తుతం 'విరాటపర్వం', 'నారప్ప' చిత్రాల్లో నటిస్తోంది. హిందీలో అజయ్ దేవగణ్ తో కలిసి 'మైదాన్' చిత్రంలో నటిస్తోంది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
ఆ నగ్న వీడియోలో వున్నది నేను కాదు.. నటి రమ్యా సురేష్