శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 4 జూన్ 2021 (14:30 IST)

The Family Man Season 2: అరేయ్ కుక్కా, ఆమెను అలా పట్టుకుంటావేంట్రా?

ది ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ 2 వెబ్ సీరిస్‌ స్ట్రీమింగ్ అయింది. ఇందులో సమంత అక్కినేని నటన అద్భుతం అని చూసిన వారు ట్వీట్లు చేస్తున్నారు. బస్సులో సమంత ప్రయాణిస్తున్నప్పుడు ఓ కామాంధుడు ఆమెను అసభ్యంగా తాకే సన్నివేశాన్ని ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ... ఇలాంటి సన్నివేశాల్లో నటించాలంటే గట్స్ వుండాలి. హ్యాట్సాఫ్ సమంత అంటూ ఆమె అభిమానులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
 
ఇందులో ఆమె త‌మిళ టెర్ర‌రిస్టుగా న‌టించారు. దానికి దారి తీసిన పరిస్థితులు కూడా తెరకెక్కించారు.ఈ ప్రాజెక్ట్ లో వ‌ర్క్ చేసిన వారిలో అత్య‌ధిక శాతం మంది త‌మిళులే ఉన్నార‌ని, ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన ప్రియ‌మ‌ణి, స‌మంత‌, ర‌చ‌యిత సుమన్ కూడా ఆ ప్రాంతం వారేనని, వారికి త‌మిళ సంస్కృతి, సంప్ర‌దాయాలంటే అపార‌మైన గౌర‌వం ఉంద‌ని, కాబ‌ట్టి ఏ ప‌రిస్థితుల్లోనూ త‌మిళ‌ల‌ను అవ‌మానించ‌డం అనేది తమ వెబ్ సీరిస్‌లో జ‌ర‌గ‌ద‌ని హామీ ఇస్తున్నారు. ఇక సమంత ఫ్యాన్స్ ఆమెకు మద్దతిస్తున్నారు.