చైతూ థాంక్యూ లుక్ అదుర్స్.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్

Nagachaitanya
సెల్వి| Last Updated: గురువారం, 3 జూన్ 2021 (21:49 IST)
Nagachaitanya
లాక్ డౌన్‌లో అక్కినేని నాగచైతన్య సినీ షూటింగ్‌లతో బిజీగా వున్నాడు. సమయం దొరికినప్పడల్లా షూటింగ్‌లను పూర్తి చేసుకుంటున్నాడు. ఇప్పటికే లవ్ స్టోరీ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న చైతూ.. ప్రస్తుతం దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘థాంక్యూ’. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో చైతూ సరసన రాశిఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.

దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలోనే చిత్రబృందం ఎంతో సాహసం చేసి ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసింది. ఈ చిత్రంలో చైతన్య రెండు డిఫెరెంట్ లుక్స్‌లో కనిపించనున్నాడు.

ఇప్పటికే చైతన్య, రాశిఖన్నా తీసుకున్న సెల్ఫీలో చైతన్య లుక్ విడుదల కాగా… తాజాగా నాగ చైతన్యకు సంబంధించిన మరో లుక్ వైరల్ గా మారింది. ‘థాంక్యూ’ సెట్లో నాగచైతన్య గడ్డంతో ఉన్న పిక్ ఒకటి నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన "లవర్స్" చిత్రం రిలీజ్ కరోనా కారణంగా వాయిదా పడింది.దీనిపై మరింత చదవండి :