నాగచైతన్య- సమంత మళ్లీ జతకట్టనున్నారా?
ఏ మాయ చేశావే, ఆటోనగర్ సూర్య, మజిలీ చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశారు నాగచైతన్య- సమంత. ఈ జంట మరో ప్రాజెక్టుతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారన్న వార్త టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
కల్యాణ్ కృష్ణ డైరెక్షన్‌లో నాగార్జున, రమ్యకృష్ణ కాంబోలో రాబోతున్న చిత్రం బంగార్రాజు..లాక్ డౌన్ ముగిసిన తర్వాత సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి.
కథ విన్న తర్వాత ఈ ప్రాజెక్టులో నటించేందుకు చైతూ-సామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. ప్రస్తుతం విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో థాంక్యూ సినిమా చేస్తున్నాడు చైతూ. షూటింగ్ దశలో ఉందీ సినిమా.
శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో చేస్తున్న లవ్ స్టోరీ చిత్రం విడుదల కావాల్సి ఉంది. మరోవైపు సమంత ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 లో నటించనుంది. గుణశేఖర్ డైరెక్ట్ చేయబోతున్న శాకుంతలం చిత్రంలో లీడ్ రోల్ చేస్తోంది.