మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 మే 2021 (17:33 IST)

''థ్యాంక్యూ" కోసం 18 గంటల పాటు పనిచేశాం.. అక్కడికి వెళ్లేందుకు భయపడ్డా?

టాలీవుడ్ యువ హీరో నాగచైతన్య నటిస్తోన్న చిత్రం థ్యాంక్యూ. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటలీ షూటింగ్ షెడ్యూల్ గురించి మీడియా ప్రశ్నించగా రాశీఖన్నా స్పందిస్తూ..కోవిడ్ నేపథ్యంలో ఇటలీ వెళ్లేందుకు చాలా భయపడినట్టు చెప్పింది. 
 
కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో మొదట ఇటలీకి వెళ్లాలంటే భయపడ్డా. కానీ కీలక షెడ్యూల్‌ను తొందరగా పూర్తి చేయాల్సిన నేపథ్యంలో.. సెట్స్‌లో కఠినంగా కోవిడ్ రూల్స్ పాటిస్తూ సీన్లను చిత్రీకరించాం. ఇటాలియన్ ప్రభుత్వం షూటింగ్స్ పై కొన్ని ఆంక్షలు విధించింది. మేము ఒక్కో రోజు 18 గంటలపాటు షూటింగ్స్ లో పాల్గొని.. వేగంగా పూర్తి చేశామని చెప్పుకొచ్చింది.
 
మరోవైపు నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. కోవిడ్ సెకండ్ వేవ్ తో థియేటర్లు మూతపడగా విడుదల నిలిచిపోయింది. పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత లవ్ స్టోరీ విడుదల కానుంది.