బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 8 మే 2021 (18:58 IST)

అంద‌రికీ థ్యాంక్స్ చెప్పిన దేవిశ్రీ‌ప్ర‌సాద్‌

devi, salman
ప్ర‌భుదేవా ద‌ర్శ‌కత్వం వ‌హించిన స‌ల్మాన్‌ఖాన్ `రాధే` చిత్రంలోని సీటీమార్ సాంగ్‌తో వ‌ర‌ల్డ్‌వైడ్‌గా సెన్సేష‌న్ క్రియేట్ చేశారు దేవిశ్రీ‌ప్ర‌సాద్‌. దేవీ కంపోజ్ చేసిన సీటీమార్ సాంగ్ వ‌రల్డ్‌వైడ్‌గా ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. తాజాగా ఈ పాట 100మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్ క్రాస్ చేసి యూ ట్యూబ్‌లో ఫాస్టెస్ట్ 100 మిలియ‌న్ వ్యూస్‌ సాధించిన సాంగ్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్ అయిన సంద‌ర్భంగా స‌ల్మాన్ ఖాన్‌, ప్ర‌భుదేవా రాక్‌స్టార్‌ దేవీని ప్ర‌త్యేకంగా అభినందించారు.
ఈ సంద‌ర్బంగా  సీటీమార్ సాంగ్‌కి స‌ల్మాన్‌ఖాన్ డ్యాన్స్ చేసిన విజువ‌ల్స్‌తో పాటు దేవి డ్యాన్స్ చేస్తున్న విజువ‌ల్స్‌ను ఒక స్పెష‌ల్  వీడియో రూపంలో రిలీజ్ చేసి స‌ల్మాన్‌ఖాన్‌, ప్ర‌భుదేవా మ‌రియు రాధే చిత్ర యూనిట్‌కు థ్యాంక్స్ తెలిపారు దేవిశ్రీ‌ప్ర‌సాద్‌. ఇప్పుడు సీటీమార్‌తో నార్త్‌ని ఒక ఊపు ఊపుతున్న రాక్‌స్టార్ త్వ‌ర‌లోనే రెండు భారీ హిందీ చిత్రాల‌కు సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆ రెండు హిందీ చిత్రాల వివ‌రాల‌ను అతి త్వ‌ర‌లోనే అనౌన్స్ చేయ‌బోతున్నారు.