దేశాన్ని ప్రేమించడం అందరి పనే. వారిని కాపాడేది సోల్జర్ పని
ముంబైలో 26/11 దాడి గురించి వర్మ గతంలో సినిమా తీశాడు. ఇప్పుడు ఆ దాడిలో పాల్గొన్న మేజర్ కథను ఆధారంగా చేసుకుని `మేజర్` సినిమా రాబోతోంది. ఎవరు, గూఢచారి చిత్రాల హీరో అడవి శేష్ టైటిల్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ఈరోజు విడుదల చేశారు. హైదరాబాద్‌లోని ఎ.ఎం.బి.మాల్‌లో దీనిని విడుదల చేశారు. పాన్ ఇండియన్ సినిమాను సిద్ధం చేస్తున్నాడు శేష్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలైంది. తెలుగు వెర్షన్‌కు సంబంధించిన టీజర్‌ను మహేష్ బాబు.. హిందీ వెర్షన్ సల్మాన్ ఖాన్.. మలయాళం వెర్షన్ పృథ్వీరాజ్ సుకుమరన్ విడుదల చేసారు. పాన్ ఇండియన్ సబ్జెక్ట్ కావడంతో అన్ని భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.
ఈ సినిమాను సూపర్‌స్టార్ మహేష్ బాబు నిర్మిస్తుండటం విశేషం. ఈ మేజర్ సినిమా కథ విషయానికి వస్తే.. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతుంది. మేజర్ సినిమాను `గూఢచారి` ఫేమ్ శశి కిరణ్ తిక్కా తెరకెక్కిస్తున్నాడు. శోభితా ధూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తాజాగా విడుదలైన టీజర్‌లో, సోల్జర్ అవ్వాలనుకుంటున్నావా? ఎందుకు? అంటూ ప్రకాష్‌రాజ్ అడుగుతాడు. వారిని ఏమంటారు. పేట్రియాట్స్ డాట్ అని శేష్ బదులిస్తాడు. - మన బోర్డర్‌లో ఎలా ఫైట్ చేయాలి, ఇండియా క్రికెట్ మేచ్ ఎలా గెలవాలి? అని అందరూ ఆలోచిస్తారు. అదీ దేశక్తే. దేశాన్ని ప్రేమించడం అందరి పనే. వారిని కాపాడడం సోల్జర్ పని.అంటూ శేష్ పలికే డైలాగ్‌తోపాటు యాక్షన్ సన్నివేశాలు చూపించారు. ఈ సినిమా జులై 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.