శనివారం, 1 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 సెప్టెంబరు 2025 (10:14 IST)

పవన్ కళ్యాణ్... ఓ పీపుల్స్ స్టార్ : నారా లోకేశ్

Nara Lokesh
ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ తన పుట్టిన రోజు వేడుకలను సెప్టెంబరు 2వ తేదీన జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ మంత్రి నారా లోకేశ్ పవన్‌కు బర్త్ డే విషెస్ చెప్పారు. 
 
వెండితెరపై అభిమానులను పవన్ కళ్యాణ్ పవర్ స్టార్‌గా ఆలరించారన్నారు. ఆ తర్వాత జనహితమే అభిమతంగా రాజకీయాల్లో ప్రవేశించిన ఆయన పీపుల్ స్టార్‌గా ఎదిగారని కొనియాడారు. ప్రజల కోసం తగ్గుతాను, ప్రజాస్వామ్యాన్ని గెలిపించేందుకు నెగ్గి తీరుతారని ప్రశంసించారు. సొంత తమ్ముడి కంటే ఎక్కువగా తనను పవన్ అభిమానిస్తారన్నారు. అన్ని సమయాల్లో అండగా నిలుస్తున్న పవనన్నకు హృదయపూర్వక పుట్టిన పుట్టిన రోజు శుభాకాంక్షలు అని లోకేశ్ పేర్కొన్నారు. 
 
ప్రజల దీవెనలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి : పవన్‌కు సీఎం బాబు విషెస్ 
 
పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. 
 
"పవన్‌ది అడుగడుగునా సామాన్యుడి పక్షం. అణువణువునా సామాజిక స్పృహ. మాటల్లో పదును, చేతల్లో చేవ, మాటకు కట్టుబడే తత్వం. జన సైన్యానికి ధైర్యం. రాజకీయాల్లో విలువలకు పట్టం, అన్నీ కలిస్తే పవనిజం అని నమ్మే అభిమానులు, కార్యకర్తలు, ప్రజల దీవెనలతో నిండు నూరెళ్లూ వర్థిల్లాలి. మరెన్నో విజయ శిఖరాలను అందుకోవాలి. పాలనలో, రాష్ట్రాభివృద్ధిలో మీ సహకారం మరువలేనిది" అంటూ ట్వీట్ చేశారు.