మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : ఆదివారం, 31 జనవరి 2021 (18:18 IST)

సిద్ధు జొన్నగడ్డ, నేహాశెట్టి జంటగా ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రం

Siddu Jonnalagadd, Nehaseddy
టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రానికి ఆదివారంనాడు శ్రీకారం చుట్టింది. సిద్ధు జొన్నగడ్డ హీరోగా, నేహాశెట్టి నటిస్తున్న ఈ సినిమా ఆదివారం సంస్థ కార్యాయంలో పూజా కార్యక్రమాతో ప్రారంభించారు. ‘కష్ణ అండ్‌ హిజ్‌ లీ’ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేసిన విమల్‌కష్ణను ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ.
 
      చిత్ర నాయకా, నాయికపై చిత్రీకరించిన ముహూర్తపు దశ్యానికి హారిక అండ్‌ హాసిని చిత్ర నిర్మాణ సంస్థ అధినేత నిర్మాత ఎస్‌. రాధాకష్ణ (చినబాబు) పెద్ద కుమార్తె హారిక క్లాప్‌ నివ్వగా, చిన్న కుమార్తె హాసిని కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. హారిక అండ్‌ హాసిని చిత్ర నిర్మాణ సంస్థ అధినేత నిర్మాత ఎస్‌. రాధాకష్ణ (చినబాబు) చిత్ర దర్శక, నిర్మాతకు స్క్రిప్ట్‌ను అందచేశారు. పి.డి.వి.ప్రసాద్‌ సమర్పిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యుర్‌ షూటింగ్‌  ఫిబ్రవరి 4నుంచి  ప్రారంభం అవుతుంది. కొత్తతరం రొమాంటిక్‌ ప్రేమకథా చిత్రమిదని తెలిపారు దర్శకుడు విమల్‌కష్ణ. చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాు, వివరాు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశి. ఇతర ప్రధాన పాత్రలో ప్రిన్స్‌, బ్రహ్మాజీ, నర్రాశ్రీనివాస్‌ ఇప్పటివరకు ఎంపికైన తారాగణం. ఈ చిత్రానికి రచన: విమల్‌ కష్ణ, సిద్దు జొన్నగడ్డ, మాటు: సిద్దు జొన్నగడ్డ, సంగీతం: కాభైరవ, ఛాయాగ్రహణం: సాయిప్రకాష్‌ ఉమ్మడి సింగు, ఎగ్జక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ధీరజ్‌ మొగిలి నేని.