శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : ఆదివారం, 31 జనవరి 2021 (18:15 IST)

విజ‌య్ దేవ‌ర‌కొండ రిలీజ్ చేసిన 'ఉప్పెన‌` `జ‌ల‌పాతం నువ్వు' పాట‌

Vijaydevarkonda, Upeena song
పంజా వైష్ణవ తేజ్‌, కృతిశెట్టి జంట‌గా సుకుమార్ రైటింగ్స్ భాగ‌స్వామ్యంతో మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న చిత్రం 'ఉప్పెన‌'. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఫిబ్ర‌వ‌రి 12న థియేట‌ర్ల‌లో ఈచిత్రం విడుద‌ల‌వుతోంది. దేవిశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూర్చ‌గా ఇప్ప‌టికే విడుద‌లైన "నీ క‌న్ను నీలి స‌ముద్రం", "ధ‌క్ ధ‌క్‌", "రంగుల‌ద్దుకున్న" పాట‌లు సంగీత ప్రియుల‌ను అమితంగా అల‌రిస్తున్నాయి.
 
లేటెస్ట్‌గా సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ చిత్రంలోని "జ‌ల జ‌ల జ‌ల‌పాతం నువ్వు" అంటూ సాగే పాట‌ను ఆదివారం రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా విజ‌య్ మాట్లాడుతూ, "ఇప్పుడే పాట విన్నాను, లాంచ్ చేశాను. దేవి శ్రీ‌ప్ర‌సాద్ గారు మ‌రోసారి మ్యాజిక్ చేశారు. సాంగ్ బ్యూటిఫుల్‌గా ఉంది. ఈ మూవీతో ముగ్గురు ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.. డైరెక్ట‌ర్ బుచ్చిబాబుగారు, హీరోయిన్ కృతి, హీరో వైష్ణ‌వ్ తేజ్‌. ఈ ముగ్గురికీ నా బెస్ట్ విషెస్ తెలియ‌జేస్తున్నా. ఈ సినిమా వారికి హ్యాపీనెస్‌ను, స‌క్సెస్‌ను తీసుకొస్తుంద‌ని ఆశిస్తున్నా. ఫిబ్ర‌వ‌రి 12న సినిమా రిలీజ్ అవుతోంది. థియేట‌ర్లు 100 శాతం ఆక్యుపెన్సీ అంటున్నారు. అంద‌రూ థియేట‌ర్ల‌లో ఈ సినిమా చూసి, ఎంజాయ్ చేయండి" అన్నారు.
 
నిర్మాత‌ల్లో ఒక‌రైన వై. ర‌విశంక‌ర్ మాట్లాడుతూ, "ఈ ఆల్బ‌మ్‌లోనే మా అంద‌రి ఫేవ‌రేట్ సాంగ్ 'జ‌ల జ‌ల జ‌ల‌పాతం నువ్వు'. విజ‌య్ దేవ‌ర‌కొండ‌గారు ఈ సాంగ్‌ను లాంచ్ చేయ‌డం హ్యాపీగా ఉంది. ఫిబ్ర‌వ‌రి 12న సినిమాను విడుద‌ల చేస్తున్నాం. సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. దేవిగారు ఈ సినిమాకు ఆల్‌టైమ్ బెస్ట్సాంగ్స్ఇచ్చారు. ఒక మంచి ల‌వ్స్టోరీకి ఆత్మలాంటి సంగీతాన్నిచ్చారు. అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో హీరో హీరోయిన్లు పంజా వైష్ణ‌వ్తేజ్‌, కృతిశెట్టి, డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానా కూడా పాల్గొన్నారు.
 
"జ‌ల జ‌ల జ‌ల‌పాతం నువ్వు.. సెల సెల సెల‌యేరుని నేను" అంటూ సాగే ఈ పాట‌ను చిత్రంలో హీరో హీరోయిన్లు వైష్ణ‌వ్ తేజ్‌, కృతి శెట్టిపై డ్యూయెట్‌గా చిత్రీక‌రించారు. దేవి శ్రీ‌ప్ర‌సాద్ స‌మ‌కూర్చిన సుమ‌ధుర బాణీల‌కు త‌గ్గ‌ట్లు అంద‌మైన ప‌దాల‌తో పాట‌ను అల్లారు గేయ‌ ర‌చ‌యిత శ్రీ‌మ‌ణి. జ‌స్‌ప్రీత్ జాజ్‌, శ్రేయా ఘోష‌ల్ గాత్రంలో ఈ మెలోడీ సాంగ్‌ మ‌ళ్లీమ‌ళ్లీ వినాల‌నేట్లు ఉంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. త‌న మ్యూజిక్ టేస్ట్‌తో, పాట‌ల‌ను ప్రెజెంట్ చేసిన విధానంతో అంద‌రి దృష్టినీ త‌న‌వైపుకు తిప్పుకున్న ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్‌ప్లే, సంభాష‌ణ‌ల‌ను అందిస్తున్నారు.
 
త‌మిళ స్టార్ యాక్ట‌ర్ విజ‌య్ సేతుప‌తి ఓ ప్ర‌ధాన‌ పాత్ర చేస్తున్న 'ఉప్పెనలో సాయిచంద్, బ్ర‌హ్మాజీ కీల‌క పాత్ర‌ధారులు. క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: బుచ్చిబాబు సానా, నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, వై. ర‌విశంక‌ర్‌.