కొండవీడు అందాలు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబుతో నిక్సన్ స్టెప్పులు
హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి విచిత్రమైన టైటిల్స్ లో విభిన్నమైన సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో టాలెంట్ ఎవడబ్బసోత్తు కాదు అని ప్రూవ్ చేసుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటిస్తున్న చిత్రం బజారురౌడి. ఈ చిత్రం కి సంబందించి ఇటీవలే అత్యంతభారిగా తెలుగుసినిమాలో వున్న భారీ తారాగాణం తో క్టైమాక్స్ ని భారీవ్యయం తో షూట్ చేశారు.
అంతేకాదు టాలీవుడ్ క్రేజి కొరియోగ్రాఫర్ ప్రేమ్‌రక్షిత్ సారధ్యంలో ఒక సాంగ్ ని చిత్రికరించారు. ఇటీవలే ఈ సినిమా కి సంబందించిన డబ్బింగ్ కార్యక్రమాలు సారధి స్టూడియోలో మొదలయ్యాయి. అన్ని కమర్షియల్ హంగులతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వసంత నాగేశ్వరావు తన క్రియెటివిటి లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఆడియన్స్ పల్స్ తెలుసుకుని 150 రూపాయిలు పెట్టి టికెట్ కొని వచ్చే ప్రేక్షకుడ్ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని ఆద్యంతం అలరించే విధంగా తెరకెక్కిస్తున్నారు.
ఆర్య చిత్రం లో మూన్ వాక్ స్టెప్ వేయించి యూత్ లో క్రేజ్ ని సొంతం చేసుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ నిక్సన్ మాస్టర్ సారధ్యం లో గుంటూరు జిల్లా కొండవీడు గ్రామ అందాల మద్యలో హీరో సంపూర్ణేష్ బాబు, హీరొయిన్ మహేశ్వరి వద్ది లపై అద్బుతమైన సాంగ్ కంపోజ్ చేశారు. రేపు దియెటర్స్ వచ్చిన అభిమానలకి ఈ సాంగ్ పండగ లా వుంటుంది. ఈ చిత్రాన్ని కెఎస్ క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మాత సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబుకి జోడిగా మహేశ్వరి వద్ది నటిస్తున్నారు. ఫిబ్రవరి లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాకు సీనియర్ ఎడిటర్ గౌతంరాజు ఎడిటింగ్ ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. సాయి కార్తిక్ సంగీతం అందిస్తున్న బజార్ రౌడీ సినిమాకు ఏ విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం మెదటి లుక్ ని విడుదల చేయటానికి సన్నాహలు చేస్తు్న్నారు.
నటీ నటులు..
బర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్ బాబు, మహేశ్వరి వద్ది, నాగినీడు, షియాజిషిండే, పృథ్వి, షఫి, సమీర్, మణిచందన, నవీన,పద్మావతి, కత్తిమహేష్, తదితరులు..
టెక్నికల్ టీం:
దర్శకుడు: వసంత నాగేశ్వరావు
నిర్మాత: సందిరెడ్డి శ్రీనివాసరావు
మాటలు: మరుధూరి రాజా
సినిమాటోగ్రఫర్: ఏ విజయ్ కుమార్
సంగీతం: సాయి కార్తిక్
ఎడిటర్: గౌతం రాజు
ఫైట్ మాస్టర్: జాషువా
కాస్ట్యూమ్స్: ప్రసాద్
మేకప్: శ్రీకాంత్
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: శేఖర్ అలవలపాటి
కో-డైరక్టర్: కె. శ్రీనివాసరావు
పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘశ్యామ్.